BJP
BJP: భారతీయ జనతాపార్టీ… 1980, ఏప్రిల్ 6న ఆవిర్భవించింది. లాల్‌కృష్ణ అధ్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో పార్టీ పురుడు పోసుకుంది. స్వతంత్య్ర భారత దేశంలో అనేక పార్టీలు ఆవిర్భవించాయి. కానీ, 130 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఎదగలేదు. హిందుత్వ నినాదంతో పురుడు పోసుకున్న భారతీయ జనతాపార్టీ 40 ఏళ్ల తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇదే సమయంలో రెండు దశాబ్దాల క్రితం వరకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది.
2 సీట్లతో ప్రయాణం..
1980లో ఆవిర్భవించిన భారతీయ జనతాపార్టీ.. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 కోట్ల ఓట్లు సాధించి 404 సీట్లు సాధించింది. భారత దేశ చరిత్రలో 400లకుపైగా సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా 400 సీట్లు సాధించలేదు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ 303 సీట్లు సాధించింది. 404 సీట్ల తర్వాత 303 సీట్లే రికార్డు.
టీడీపీకి ప్రతిపక్ష హోదా..
ఇక 1984 ఎన్నికల్లో దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ లోక్‌సభలో ప్రతిపక్ష హోదా సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 404 సీట్లు సాధించగా, నందమూరి తారకరామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలకు 30 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ తర్వాత లోక్‌సభలో అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న పార్టీగా టీడీపీ నిలిచింది. భారత దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ లోక్‌సభలో ప్రతిపక్ష హోదా సాధించింది.
బీజేపీ దినదినాభివృద్ధి..
ఇదిలా ఉంటే.. 1984 నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతాపార్టీ దినదినాభివృద్ధి చెందుతోంది. 1984లో 2 స్థానాలు సాధించిన బీజేపీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. 1988లో ఎల్‌కే.అధ్వానా ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. అయోధ్య ఉద్యమం పేరుతో ఈ యాత్ర సాగింది. ఈ క్రమంలో 1992, డిసెంబర్ 6న మసీదుపై దాడిచేశారు. దీంతో అధ్వానీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధ్వానీ వాజ్‌పేయిని 6పధాని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ప్రధాని కావాలనుకున్న అధ్వానీ ఆశ నిరాశగానే మిగిలింది.
వాజ్‌పేయి ప్రధానిగా..
ఇక 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి అత్యధిక సీట్లు 182 సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. అయితే 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. దీంతో 1999లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా 182 సీట్లతో ఎక్కవ సీట్లు సాధించిన పార్టీగా నిలించింది. ఎన్డీఏ అనుకూల పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
2004 నుంచి యూపీఏ..
ఇదిలా ఉండగా, 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గిపోయాయి. ఇందులో కేవలం 138 స్థానాలకే పరిమితమైంది. దీంతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన్‌మోహన్‌సింగ్ ప్రధాని అయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 116 సీట్లకే పరిమితమైంది. 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది.
మోదీని ప్రధానిగా ప్రనకటించడంతో..
ఇక 2014లో బీజేపీ నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేఈప ఏకంగా 282 సీట్లు సాధించింది. మోదీ ప్రధాని అయ్యారు. ఆయన సారథ్యంలో దేశంలో అనేక సంక్షేమ పథకాలతోపాటు హిందుత్వ నినాదం, బీజీపీకి కలిసి వచ్చింది. దీంతో 2019 ఎన్నికల్లో 303 సీట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. మరోమారు మోదీ ప్రధాని అయ్యారు. అనేక చట్టాలు తెచ్చారు. భారత్‌ను 5వ ఆర్థిక శక్తిగా నిలిపారు. రామ మందిరం నిర్మించారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు. సీఏఏ అమలు వంటి చట్టాలు రూపొందించారు.
అబ్‌కీబార్ చార్‌సౌ పార్..
ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల నినాదంతో ముందుకు సాగుతోంది. ఇప్పటిఏ అన్ని సర్వేలు బీజేపీ దేశంలో మరోమారు అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. అయితే బీజేపీ మాత్రం 400 సీట్లతో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మోదీ 370 సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు.
తగ్గుతున్న కాంగ్రెస్ ప్రభ..
1984 నుంచి బీజేపీ ప్రభ పెరుగుతూ వస్తుండగా, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా సాధించిన కాంగ్రెస్ 2019లో ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు కూడా సాధించలేకపోయింది. కుటుంబ పార్టీ, అవినీతి, రాజీవ్‌గాంధీ హయాంలో జరిగిన బోఫోర్స్, బొగ్గు, 2జీ స్ప్రెక్ట్రం కుంభకోణాలు, పీవీ హయాంలో జరిగిన కుంభకోణాలు కాంగ్రెస్ అవినీతి పార్టీ అనే ముద్ర వేశాయి. కాంగ్రెస్‌ను గెలిపిస్తే అవినీతే అన్న అభిప్రాయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఇపుపడు ఉనికి కాపాడుకోవడమే గగనంగా మారింది. మరి 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Interesting facts about bharatiya janata party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com