
Kiccha Sudeep- Prakash Raj: ఇవాళ తెలంగాణలో బండి సంజయ్ అరెస్ట్ వల్ల ఈ వార్తకు అంత ప్రాధాన్యం లేకుండా పోయింది కానీ.. లేకుంటే సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిలిచేది. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మరో మారు అధికారంలోకి రావాలని భావిస్తోంది.. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీనే ఇస్తోంది. దీంతో భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్ల అవసరం పడింది. ఆ లోటు ఎవరు భర్తీ చేస్తారా అని అనుకున్నప్పుడు కిచ్చా సుదీప్ నేను ఉన్నా అంటూ వచ్చాడు. ఒక హోటల్లో జరిగిన సమావేశంలో బుధవారం భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించాడు. ఎన్నికల్లో పార్టీ తరఫున మాత్రం ప్రచారం చేస్తానని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కి మాట ఇచ్చాడు.
సుదీప్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడంతో కర్ణాటకలో రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే వివాదాస్పదమైన మాటలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచే ప్రకాష్ రాజ్ సుదీప్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం పట్ల షాకింగ్ కామెంట్స్ చేశాడు. సుదీప్ నిర్ణయంతో షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు. సుదీప్ అలా చేసి ఉండాల్సింది కాదు అన్నాడు. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. ఇక ప్రకాష్ రాజ్ స్వస్థలం కర్ణాటక. ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లోనూ, ఉత్తరాది సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నాడు. భారత రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు దారుగా కొనసాగుతున్నారు. తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రకాష్ రాజ్ కు పేరు ఉంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సుదీప్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం పట్ల స్పందించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ డ్రామాలు మొదలుపెట్టిందని, అందులో భాగమే సుదీప్ ను తమకు మద్దతు ఇచ్చేలా చేసుకోవడం అని అని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందని చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఆరున్నర కోట్ల కన్నడ సోదరీ సోదరీమణులే ఎన్నికలను ప్రభావితం చేస్తారని వ్యాఖ్యానించారు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జి రణ్ దీప్ సూర్జే వాలా వ్యాఖ్యానించారు. ఎన్నికలను సినిమా వాళ్ళు ప్రభావితం చేయలేరని చెప్పారు. సూర్జే వాలా మాటలు అంటున్నప్పుడు ఆయన పక్కన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అక్కడే ఉన్నాడు.. అయితే గతంలో సుదీప్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే దీనికి సుదీప్ అసలు ఒప్పుకోలేదు.
ఇది జరుగుతుండగానే సుదీప్ ఒక కీలక వ్యాఖ్యలు చేశాడు. భారతీయ జనతా పార్టీకి మద్దతు దారుడినని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు తనకు నచ్చుతాయని సుదీప్ వ్యాఖ్యానించాడు. అభ్యర్థుల తరఫున తాను ప్రచారం చేస్తానని ప్రకటించాడు. కర్ణాటక ముఖ్యమంత్రితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వివరించాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు పాల్గొంటున్న నేపథ్యంలో.. సుదీప్ రాక తమకు బలాన్ని చేకూర్చుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
“I am shocked and hurt by Kichha Suddep’s statement,” says actor Prakash Raj on Kannada actor Kichcha Sudeep extending his support to BJP for the upcoming #KarnatakaAssemblyElection2023
(File Pic) pic.twitter.com/8olSSfwcJ8
— ANI (@ANI) April 5, 2023