Instamart 2025 Report: మరికొద్ది రోజుల్లో 2025 కాలగర్భంలో కలిసిపోనుంది.. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ అనేది ప్రస్తుతం మన జీవితంతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్న నేపథ్యంలో.. ఈ కామర్స్ సంస్థలు తమ లావాదేవీలను వెల్లడిస్తుంటాయి. తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటాయి. మనదేశంలో ఈ కామర్స్ సంస్థలలో దిగ్గజ కంపెనీ ఇన్ స్టా మార్ట్ ఈ ఏడాదికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
ఆ సంస్థ వెల్లడించిన ఈ ఏడాది వార్షిక నివేదిక ప్రకారం.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత కనిష్టంగా ఖర్చు పెట్టాడు. అతడు కేవలం పది రూపాయల ఆర్డర్ మాత్రమే ఇచ్చాడు. పది రూపాయల విలువైన ప్రింట్ అవుట్ కావాలని అతడు ఆర్డర్ పెట్టాడు. వాటిని మాత్రమే అతడు తెప్పించుకున్నాడు. ఈ ఏడాది ఇన్స్టా మార్ట్ లో అత్యంత కనిష్టమైన లావా దేవి ఇదేనని ఆ సంస్థ పేర్కొంది.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి లేటెస్ట్ ఐఫోన్ కోసం ఏకంగా 4.3 లక్షలు ఖర్చు పెట్టాడు.. ఇది అత్యంత ఖరీదైన లావాదేవీ అని ఇన్స్టా మార్ట్ ప్రకటించింది. కేవలం అతడు ఫోన్ల కోసమే భారీగా ఖర్చు పెట్టాడని ఇన్స్టా వెల్లడించింది. మరోవైపు ఓ వ్యక్తి ఏడాదిలో 22 లక్షల ను వివిధ ఉత్పత్తుల కొనుగోలుకు ఖర్చు పెట్టాడు. ముంబై నగరానికి చెందిన ఓ వ్యక్తి దాదాపు 15.16 లక్షల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశాడు. చెన్నై నగరానికి చెందిన ఓ వ్యక్తి క*డో*మ్ ల కోసం ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు.
ఇన్ స్టా మార్ట్ నివేదిక ప్రకారం మనదేశంలో టైర్ 2 నగరాలలో రాజ్ కోట్ వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈ నగరం 10రెట్ల వృద్ధిని నమోదు చేసింది. లుధియానా ఏడు, భువనేశ్వర్ నాలుగు రెట్ల వృద్ధిని శ్రద్ధ చేసుకుంది.. ప్రజలు ఎక్కువగా ఆర్డర్ చేసిన వాటిల్లో కరివేపాకు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పెరుగు, గుడ్లు, పాలు, పండ్ల వంటివి ఉన్నాయి.. కేరళ రాష్ట్రంలోని కొచ్చి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 368 సార్లు కరివేపాకు కోసం ఆర్డర్ పెట్టాడు. ఈ ప్రకారం చూసుకుంటే రోజుకు సగటున ఒకసారి అతడు ఆర్డర్ పెట్టినట్టు అర్థమవుతుంది. బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి తరచూ ఇన్ స్టా మార్ట్ లో కొనుగోలు జరిపాడు. అదే కాదు తనకు వస్తువులను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తికి ఏకంగా 68,600 టిప్ గా చెల్లించాడు. ఇక మిగతా తినుబండారాలు కూడా భారీగానే విక్రయమయ్యాయని ఇన్ స్టా మార్ట్ వెల్లడించింది. ఉదయం 7:00 నుంచి 11 గంటల వరకు.. సాయంత్రం 4గంటల నుంచి ఏడు గంటల వరకు తమకు ఆర్డర్లు ఎక్కువగా వచ్చినట్టు insta mart ప్రకటించింది.