
Injustice to Venkaiah: తెలుగు రాజకీయ నేత.. వివాద రహితుడు.. బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడుపై సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి..వెంకయ్యకు అన్యాయం చేశారని అన్నారు. వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని వెల్లడించారు. గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని తెలిపారు. చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయని అన్నారు. ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదన్నారు. వెంకయ్య నాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేదని వివరించారు నటుడు రజనీకాంత్.
నాడు పొరపాటున రాజకీయ నాయకుడయ్యాడనీ..
గతంలో వెంకయ్య నాయుడు పొరపాటున రాజకీయ నాయకుడు అయ్యాడని సంచలన కామెంట్స్ చేశారు రజినీకాత్. 2019. ఆగస్టు 10న చెన్నైలోని ఉప రాష్ట్రపతి వెంకయ్యపై రచించిన పుస్తకం ‘లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్’ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్ చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవి కలకలం రేపాయి.. ‘వెంకయ్యనాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మిక వేత్త.. ఆయన పొరపాటున రాజకీయ నాయకుడయ్యారు.. రాజకీయాల్లోకి రాకుండా ఆధాత్మికరంగం వైపు వెళ్లి ఉంటే గొప్ప మార్గదర్శకుడు అయ్యి ఉండేవారు’ అంటూ ప్రశంసించారు. అలాంటి ఆధ్యాత్మికవేత్తను తాము పోగొట్టుకున్నామని రజినీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రజినీకాంత్ మాటలకు వేదికపై ఉన్న అమిత్ షా , వెంకయ్య షాక్ అయ్యారు. ఆ తర్వాత సరదాగా నవ్వుకున్నారు.

మోదీ షా వచ్చాక..
కేంద్రంలో మోడీషాల ద్వయం వచ్చాక సీనియర్లను పార్టీ నుంచి సాగనంపింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా చాలా మందిని రాజకీయాలకు దూరం చేసింది. రాజకీయంగా యాక్టివ్ గా ఉండే వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిని చేసి అడ్డు తొలగించుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఎంతో యాక్టివ్ గా ఉండే వెంకయ్యను ఉపరాష్ట్రపతిని చేసి ఉత్సవ విగ్రహంలా మార్చిన మోడీషాల తీరును ఎండగట్టేందుకే ఇలా రజనీకాంత్ మాట్లాడి ఉండవచ్చన్న చర్చ జరిగింది.
తాజాగా ఉప రాష్ట్రపతి చేయడం నచ్చలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.