Injection : మీరు ఎప్పుడైనా సూది లేదా ఇంజెక్షన్ తీసుకున్నారా? ప్రస్తుత రోజుల్లో ఇంజెక్షన్ తీసుకోని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఇంజెక్షన్ టీకా కావచ్చు లేదా సాధారణ టెటానస్ సూది కావచ్చు. కానీ చాలా మంది పిల్లలు, పెద్దలు సహా ఇంజెక్షన్‌లకు చాలా భయపడుతారన్న సంగతి తెలిసిందే. ఈ రోజు మనం ఇంజెక్షన్లకు ఎందుకు భయపడతామో, దాని వెనుక కారణం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంజెక్షన్ భయం
ఇంజెక్షన్ల అంటే భయపడే చాలా మందిని మన చుట్టూ చూసే ఉంటాం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు టాబ్లెట్ లేదంటే టానిక్ ఇవ్వండి కానీ, ఇంజెక్షన్లు మాత్రం వేయకండి అని డాక్టర్లను ప్రాధేయపడడం చూసే ఉన్నాం. అయితే ఇంజెక్షన్లకు ఏ వ్యక్తి అయినా ఎందుకు భయపడతాడు, దాని వెనుక కారణం ఏమిటి అనేది ప్రశ్న. ఇది ఏదైనా వ్యాధి లక్షణమా? తెలుసుకుందాం..
ట్రిపనోఫోబియా సమస్య
ఇంజక్షన్ భయంతో పారిపోయేవారు, మానసికంగా కలవరపడేవారు, గుండె చప్పుడు ఎక్కువ అయ్యేవారు లేదా భయంతో వ్యాక్సిన్ తీసుకోకుండా పారిపోయే వారు ట్రిపనోఫోబియాతో బాధపడుతున్నట్లు.. దీనితో బాధపడుతున్న రోగులు తరచుగా అనేక ముఖ్యమైన టీకాలలో భాగం కావడాన్ని కోల్పోతారు.
ట్రిపనోఫోబియా అంటే ఏమిటి
ట్రిపనోఫోబియా అనేది ఒక రకమైన మానసిక భయం.. నిజానికి ఇది ఇంజెక్షన్ సూది వల్ల జరుగుతుంది, ఇందులో చాలా రకాల ఫోబియాలు ఉన్నాయి. అయితే ఈ భయం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఈ ఫోబియాలో ప్రజలు ఇంజెక్షన్లు లేదా హైపోడెర్మిక్ సూదులకు భయపడతారు. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం అంచనాల ప్రకారం, దీనితో బాధపడే రోగికి ఇంజెక్షన్‌ను చూసినప్పుడు కలత చెందడం ప్రారంభం అవుతుంది. ప్రతి నలుగురు పెద్దలలో ఒక్కరికి, ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఈ భయాన్ని తీవ్రంగా అనుభవిస్తారు. సూదిని చూసి భయపడండి. ట్రిపనోఫోబియా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఇలాంటి వాళ్లకు చిన్ననాటి నుండి సూదుల భయం ఉంటుంది.
చికిత్స ఏమిటి
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్యపై నిపుణుల సలహాలను అనుసరించాలి. అంటే, ట్రిపనోఫోబియా లక్షణాలను అనుభవిస్తే, మీరు చేయవలసిన మొదటి విషయం డాక్టర్ ను సంప్రదించండి. దీనితో బాధపడుతున్న రోగి సైకాలజిస్ట్ వద్దకు వెళ్లాలని చెప్పాలి. దాని చికిత్స రోగి భయం తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.