Industries: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు ఉనికి కోల్పోతున్నాయి. కొత్తవి రాకపోగా పాతవి కూడా మూట ముళ్లె సర్దుకుంటున్నాయి. దీంతో ఏపీ పరిశ్రమల రహిత రాష్ర్టంగా వినుతికెక్కనుంది. దీనికంతటికి కారణం రాజకీయ కారణాలే. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి హెచ్ ఎస్ బీసీ కూడా టాటా చెబుతోంది. తన క్యాంపస్ ను ఖాళీ చేసి వరంగల్ కు వెళ్లాలని భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ప్రయత్నాలు పూర్తయినట్లు తెలుస్తోంది.
గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ప్రస్తుత ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. దీంతోనే తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలు ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ తరువాత వరంగల్ కు ఆ హోదా ఉండటంతో ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపడంతో వరంగల్ కు పరిశ్రమలు తరలి వెళ్తున్నాయి.
జెన్ ప్యాక్ట్ కంపెనీ కూడా వరంగల్ కు తరలి వెళ్లడానికి సిద్ధపడింది. ఇదే విషయాన్ని సీఈవో మంత్రి కేటీఆర్ తో జరిగిన వర్చువల్ సమావేశంలో వెల్లడించడం గమనార్హం. అన్ని జిల్లా కేంద్రాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గాను అన్ని దారులు వెతుకుతోంది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతోంది.
Also Read: Cold Intensity: తెలంగాణ, ఏపీలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!
ఏపీకి రావాల్సిన పరిశ్రమలను అక్కడి ప్రభుత్వం కాదనుకుంటుంటే తెలంగాణ మాత్రం ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి దొరుకుతుందని భావిస్తోంది. ఇందుకు గాను అన్ని ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తోంది.
Also Read: Omicron in AP: టెన్షన్.. టెన్షన్.. ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. అప్రమత్తమైన అధికారులు..