https://oktelugu.com/

Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” సినిమాపై మండిపడుతున్న కర్ణాటక ఆడియన్స్…

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమాపై కన్నడిగులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యాన్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఈ చిత్రం రేపు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 06:25 PM IST
    Follow us on

    Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమాపై కన్నడిగులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యాన్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఈ చిత్రం రేపు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే కన్నడ నటుడు ధనుంజయ, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో #BoycottPushpainKarnataka ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణాటకలో బహిష్కరించాలని కోరుతూ అక్కడి ప్రజలు ఈరోజు ఉదయం నుంచి స్పెషల్ హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుండడం గమనార్హం.

    Pushpa Movie

    Pushpa Movie

    Also Read: యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో రికార్డు … 2021 లో అల్లు అర్జున్ టాప్

    కన్నడిగులు ఆగ్రహానికి కారణం ఏమిటంటే… ఈ కర్ణాటకలో ఈ చిత్రం కన్నడ వెర్షన్ కంటే ఎక్కువగా తెలుగులోనే విడుదల అవుతుండడం. అక్కడ లుగు వెర్షన్‌తో పోలిస్తే తక్కువ సంఖ్యలో కన్నడ వెర్షన్ ను విడుదల చేస్తున్నారట. దీంతో తమ రాష్ట్రంలో తమ భాషకు ప్రాధాన్యతను ఇవ్వకుండా ఇతర భాషల్లో ఎలా రిలీజ్ చేస్తారు ? అంటూ మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు. కన్నడ కాకుండా తెలుగు వెర్షన్ రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాలలో విడుదల కావడం ప్రాంతీయవాదులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో కర్ణాటకలోని అల్లు అర్జున్ అభిమానులు… ఈ చిత్రాన్ని బహిష్కరించమంటున్నాం అంటే తెలుగుకు, లేదా సినిమాకు తాము వ్యతిరేకం కాదని, కానీ తమ రాష్ట్రంలో తమ భాషకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ‘తగ్గేదే లే’ అంటూ ట్రెండింగ్ లోకి వచ్చారు. ఇటీవల ప్రెస్ మీట్ కి ఎల్‌ఈ‌టి వచ్చారంటూ బెంగుళూరు లో ప్రశ్నించగా అందుకు గలకారణాన్ని వివరించి అల్లు అర్జున్ సారీ చెప్పిన విషయం తెలిసిందే.

    Also Read: “పుష్ప”లో కీ పాయింట్ ఇదే!