Indo Farm Equipment IPO : 2024 సంవత్సరం చివరి రోజున అంటే డిసెంబర్ 31న ప్రారంభమైన ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవో పై ఇన్వెస్టర్లు కాస్త డైలమాలో ఉన్నారు. ఇప్పటి వరకు సబ్‌స్క్రిప్షన్ రెండవ రోజున ఈ ఐపీవో 54.74 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. జనవరి 2 వరకు ఈ ఐపీవోలో ఇన్వెస్టర్లు డబ్బును పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించింది. ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీఓ ప్రారంభానికి ముందు సోమవారం (డిసెంబర్ 30) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.78 కోట్లు సమీకరించింది. ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ షేర్లు గ్రే మార్కెట్‌లో కూడా ప్రకంపనలు సృష్టిస్తు్న్నాయి. నేడు ఈ ఇష్యూ షేర్లు రూ.95 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఐపీవోల పరంగా 2024 సంవత్సరం ఇటు ఇన్వెస్టర్లకు అటు కంపెనీలకు ది బెస్ట్ అనే చెప్పాలి.. కొత్త సంవత్సరం 2025లో ఐపీవో మార్కెట్ వృద్ధి చెందుతుందని అంచనా. ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవో కూడా మంచి లిస్టింగ్ లాభాలను సూచిస్తోంది.
ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ స్టేటస్
ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవోకి ఇప్పటివరకు పెట్టుబడిదారుల నుండి మంచి స్పందన లభించింది. పబ్లిక్ ఇష్యూకి 46,36,86,555 షేర్లకు బిడ్లు అందాయి.. రెండవ మూడు అప్లికేషన్లలో 84,70,000 షేర్లు వచ్చాయి. పబ్లిక్ ఇష్యూ కోసం ఎన్ఐఐ అత్యధిక బిడ్‌లు వేసింది.. 132.03 సార్లు సబ్‌స్క్రయిబ్ చేసింది. ఇది కాకుండా, క్యూఐబీ 11.96 రెట్లు ఎక్కువ సబ్‌స్క్రయిబ్ పొందింది. రిటైల్ ఇన్వెస్టర్ల (RIIలు) నుండి కూడా మంచి స్పందన లభించింది.. రెండవ రోజు వరకు 46.07 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ చేయబడింది.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం షేర్ రిజర్వ్
ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవోలో 50శాతం అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs), 35శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు (RIIలు), 15శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIలు) కేటాయించబడింది.
పరిమాణం 260 కోట్లు
ఐపీవో మొత్తం పరిమాణం రూ. 260 కోట్లు. ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవోలో 86 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, ప్రమోటర్ రణబీర్ సింగ్ ఖడ్వాలియా ద్వారా 35 లక్షల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.204 నుండి రూ.215గా నిర్ణయించబడింది. ఒక లాట్ ఐపీవోలో 69 షేర్లు ఉంటాయి. ఈ విధంగా రూ. 215 ఇష్యూ ఎగువ ధర బ్యాండ్ ప్రకారం, రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీవోలో కనీసం రూ. 14,835 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఐపీవో ఎగువ ధర బ్యాండ్ వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
గ్రే మార్కెట్‌లో కంపనలు
ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవో గ్రే మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. గొప్ప లిస్టింగ్‌ను సూచిస్తోంది. InvestorGain ప్రకారం.. ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవో జీఎంపీ బుధవారం రూ. 95 వద్ద ట్రేడవుతోంది. అంటే రూ.310 ధరతో షేర్లను లిస్ట్ చేయవచ్చు. సోమవారం దీని జీఎంపీ రూ.80గా ఉంది.