YSRTP Leader Indira Shoban Resigns: షర్మిలమ్మా ఇదేంటమ్మా.. అప్పుడే భారీ షాకులు..

YSRTP Leader Indira Shoban Resigns: వైఎస్ షర్మిల (YS Sharmila)పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. అప్పుడే నేతల మధ్య సయోధ్య కరువవుతోంది. ఫలితంగా పార్టీ మనుగడ కష్టంగా మారనుంది. పార్టీలో చేరికలు ప్రారంభానికి ముందే రాజీనామాల పర్వం మొదలవుతోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్(Indira Shoban) పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ తెలంగాణలో ప్రభావం చూపుతుందని భావించిన నేతల మధ్య దూరాలు పెరిగిపోవడంతో పార్టీ భవితవ్యం రసకందాయంలో పడింది. షర్మిల […]

Written By: Raghava Rao Gara, Updated On : August 20, 2021 3:33 pm
Follow us on

YSRTP Leader Indira Shoban Resigns: వైఎస్ షర్మిల (YS Sharmila)పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. అప్పుడే నేతల మధ్య సయోధ్య కరువవుతోంది. ఫలితంగా పార్టీ మనుగడ కష్టంగా మారనుంది. పార్టీలో చేరికలు ప్రారంభానికి ముందే రాజీనామాల పర్వం మొదలవుతోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్(Indira Shoban) పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ తెలంగాణలో ప్రభావం చూపుతుందని భావించిన నేతల మధ్య దూరాలు పెరిగిపోవడంతో పార్టీ భవితవ్యం రసకందాయంలో పడింది.

షర్మిల పార్టీలో తనకు సముచిత గౌరవం లేదని భావించి పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటంచినా అసలు విషయం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. పార్టీలో ఇష్టమొచ్చిన రీతిలో భాషా ప్రయోగం చేయడంతో ఆమె నొచ్చుకున్నట్లు సమాచారం. ఇంతవరకు తాను ఎవరితో మాట పడలేదని, ఇప్పుడు పార్టీలో గాడిద అంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడడం చూస్తుంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇకపై పార్టీలో ఇమడలేమని భావించి పార్టీకి దూరం కావాలని చూస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడంతో పార్టీలో జోష్ పెరిగింది. నేతలందరు అటువైపు చూస్తున్నారు. ఈమేరకు ఇందిరా శోభన్ తన తదుపరి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. మగలో పుట్టి పుబలో పోయే పార్టీగా షర్మిల పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో షర్మి పార్టీ తెలంగాణలో ప్రభావం చూపడం ఎలా ఉన్నా పార్టీ మనుగడే కష్టంగా మారుతోంది. ప్రస్తుతం రాజీనామాల పరంపర మొదలు కావడంతో భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో రాష్ర్టంలో నాయకత్వం పోరాట పటిమ ఏ మేరకు పార్టీలపై చూపనుందని ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో షర్మిల పార్టీ రాష్ర్టంలో వ్యాపించడం ఎలా అని ఆలోచనలో పడిపోయారని సమాచారం.