https://oktelugu.com/

Allu Arjun, Parasuram movie on cards : మహేష్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ !

Allu Arjun, Parasuram movie: ఒక్క ఘనవిజయం జీవితాన్ని మారుస్తుంది. గీతగోవిందం సినిమాకి ముందు చిన్న హీరో కూడా డేట్లు ఇవ్వడానికి ఆలోచిస్తే.. దర్శకుడు పరశురామ్ (Parasuram) మూడేళ్లు ఖాళీగా ఉన్నాడు. కానీ ఆ సినిమా విజయం ‘సర్కారువారి పాట’ సినిమాని తీసుకొచ్చింది. మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు అనగానే, మిగిలిన స్టార్ హీరోలు కూడా పరుశురామ్ కి డేట్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) కూడా పరుశురామ్ తో ఒక […]

Written By:
  • admin
  • , Updated On : August 20, 2021 / 03:42 PM IST
    Follow us on

    Allu Arjun, Parasuram movie: ఒక్క ఘనవిజయం జీవితాన్ని మారుస్తుంది. గీతగోవిందం సినిమాకి ముందు చిన్న హీరో కూడా డేట్లు ఇవ్వడానికి ఆలోచిస్తే.. దర్శకుడు పరశురామ్ (Parasuram) మూడేళ్లు ఖాళీగా ఉన్నాడు. కానీ ఆ సినిమా విజయం ‘సర్కారువారి పాట’ సినిమాని తీసుకొచ్చింది. మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు అనగానే, మిగిలిన స్టార్ హీరోలు కూడా పరుశురామ్ కి డేట్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

    తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) కూడా పరుశురామ్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గీతా ఆర్ట్స్ వారితో పరశురామ్ కి మంచి బంధం ఉంది, అన్నిటికీ మించి తనకు ఆ సంస్థ లైఫ్ ఇచ్చింది అనే గురుభక్తి ఉంది. అందుకే, బన్నీ కబురు పంపగానే వెళ్లి, ఓ కథ చెప్పి వచ్చాడు. ‘కథ నచ్చలేదు, కానీ నీతో సినిమా చేస్తాను, ఇంకో కథ ఆలోచించు’ అంటూ బన్నీ అభయం ఇచ్చాడు.

    ప్రస్తుతం పరశురాం బన్నీ కోసం కథలు వినే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. వేరే రచయిత దగ్గర అయినా మంచి కథ ఉంటే తీసుకోవాలన్నది పరుశురామ్ ఆలోచన. కాబట్టి.. అల్లు అర్జున్ – పరశురామ్ కలయికలో సినిమా చేసే దిశగా పనులను మొదలు పెట్టింది గీతా ఆర్ట్స్. మరి పరశురామ్ – బన్నీ సినిమా ఎప్పటికీ సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

    మరోపక్క నాగచైతన్యతో కూడా ఓ సినిమా చేస్తాను అంటూ కమిట్ అయ్యాడు పరశురామ్. ఆ సినిమా వచ్చే ఏడాది ఉండనుందని ఇప్పటివరకు ఉన్న టాక్. పైగా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా పరశురామ్ ఇప్పటికే పూర్తి చేశాడు. కానీ, బన్నీతో సినిమా అవకాశం వచ్చింది కాబట్టి.. చైతుతో చేసే సినిమాని పోస్ట్ ఫోన్ చేసే ఛాన్స్ ఉంది.

    నిజానికి సర్కారు వారి పాట సినిమాకి ముందు మంచు విష్ణుతో పరుశురామ్ ఒక సినిమా చేయాలి. ఈ మేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ, గీత గోవిందం సూపర్ హిట్ అయ్యే సరికి విష్ణుతో సినిమాని క్యాన్సిల్ చేసుకుని… పరుశురామ్, మహేష్ తో సినిమా చేయడానికి మొహమాటం లేకుండా ముందుకు వెళ్ళాడు. ఈ లెక్కన చైతు సినిమా ప్లేస్ లో బన్నీ సినిమా ఉండే అవకాశమే ఎక్కువ.