https://oktelugu.com/

Israel Hamas War: ఇజ్రాయిల్ పప్పెట్ మోడీ అన్నవాళ్లు.. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?

ఇజ్రాయిల్ దేశం భారతదేశానికి అత్యంత నమ్మకమైన భాగస్వామి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక బంధాలను ఇరు దేశాల మధ్య మరింత బలోపేతం చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 12, 2024 / 03:10 PM IST

    Israel Hamas War

    Follow us on

    Israel Hamas War: మొన్న మాల్దీవుల మంత్రులు ఏమన్నారు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పప్పెట్ అని ఎగతాళి చేశారు. అంతేకాదు మన దేశంలో ఉన్నవారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇజ్రాయిల్ దేశాన్ని ఉపయోగించి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకుంటున్నారని విమర్శించారు. కానీ తన ప్రభుత్వం ఏ దేశానికి కూడా పప్పెట్ కాదని.. ఏ దేశాన్ని కూడా ఉపయోగించి తిరిగి అధికారంలోకి రావాలని అనుకోవడం లేదని.. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరూపించింది. తనకు దగ్గర మిత్రుడైనప్పటికీ.. అతడి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఐక్యరాజ్యసమితి వేదికగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎండకట్టింది. దీంతో ఒక్కసారిగా అటు దేశ రాజకీయాల్లో, ఇటు ప్రపంచ రాజకీయాల్లో సంచలనం నమోదయింది.

    ఇజ్రాయిల్ దేశం భారతదేశానికి అత్యంత నమ్మకమైన భాగస్వామి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక బంధాలను ఇరు దేశాల మధ్య మరింత బలోపేతం చేశారు. ముఖ్యంగా ఇజ్రాయిల్ అధ్యక్షుడు నేతాన్యాహు తో పలుమార్లు నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. రక్షణ రంగానికి సంబంధించిన పలు ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. అయితే ఇజ్రాయిల్ దేశంలో తయారైన పెగాసస్ స్పైవేర్ ను దేశాన్ని ప్రతిపక్ష పార్టీల మీదకు ప్రయోగిస్తున్నారని.. ఇందులో భాగంగానే ఇజ్రాయిల్ దేశంతో నరేంద్ర మోడీ రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారని అప్పట్లో రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాదు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు పలువురు కీలకమైన రాజకీయ నాయకులకు ఆపిల్ ఫోన్ నుంచి కూడా ఆ తరహా సందేశాలు వచ్చాయి. ఇదంతా జరుగుతుండగానే ఇజ్రాయిల్ దేశం పైకి హమాస్ తీవ్రవాదులు దండెత్తారు. ఇజ్రాయిల్ రక్షణ కూడా సైతం తుత్తునీయలు చేశారు. అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఇజ్రాయిల్ బలగాలు పాలస్తీనా మీద విరుచుకుపడ్డాయి. హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడులను ప్రపంచం మొత్తం వ్యతిరేకించగా.. కేవలం భారత్ మాత్రమే సమర్ధించింది. ఇజ్రాయిల్ దేశానికి దాడి చేసుకునే హక్కు ఉందంటూ ప్రకటించింది.

    అయితే ఇప్పుడు తాజాగా ఇజ్రాయిల్ దేశానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. అంతేకాదు ఇజ్రాయిల్ దేశం తన తీరు మార్చుకోవాలని హితవు కూడా పలికింది. ఎందుకంటే ఇటీవల హమాస్ తీవ్రవాదులపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయిల్ దళాలు.. ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నాయి. ఇందులో పాలస్తీనా దేశానికి సంబంధించిన కొంతమంది సామాన్య పౌరులు కూడా ఉంటున్నారు. ఇజ్రాయిల్ దళాలు చేస్తున్న దాడుల వల్ల వారు మరణిస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం తప్పుపడుతోంది. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను సమర్థిస్తున్నామని.. అదే సమయంలో సామాన్య పౌరుల ప్రాణాలను హరిస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని ప్రకటించింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ఓటింగ్ లోనూ ఇజ్రాయిల్ దేశానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఇజ్రాయిల్ తన తీరును మార్చుకోవాలని హితవు పలికింది. ఈ పరిణామంతో అటు దేశ రాజకీయాలు ఇటు ప్రపంచ రాజకీయాల్లో ఒక్కసారిగా కీలక కుదుపు చోటుచేసుకుంది. సరిగ్గా ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన నేపథ్యంలో దేశంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా మోడీ చేశారని వారు అంటున్నారు. మోడీ తీసుకున్న ఒక్క నిర్ణయంతో త్వరలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు పెగాసస్ విషయాన్ని ప్రస్తావనకు తీసుకు రాకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.