PM Modi: ఏ చిన్న పని చేసినా.. దానిగురించి పెద్దగా ప్రచారం చేసుకోవడం నేటి రాజకీయ నేతలకు అలవాటు. కొత్త పథకం ప్రారంభించినా, కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా టీవీలు, పత్రికలతోపాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, భారత ప్రధాని నరేంద్రమోదీ ఒక పెద్ద ఆపద నుంచే ప్రపంచాన్ని ఆదుకున్నారు. భారీ అణుయుద్ధం జరుగకుండా ఆపగలిగారు. కానీ ఇసుమంత కూడా ప్రచారం చేసుకోలేదు. అంతర్జాతీయ మీడియా సీఎన్‌ఎస్ ఇటీవల ఈ విషయాన్ని బయటపెట్టింది.
ఏం జరిగిందంటే..
ఉక్రెయిన్‌పై రష్యా రెండేళ్లుగా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడం ఇష్టం లేని రష్యా ఆ దేశంపై దాడులకు దిగింది. దీంతో రంగంలోకి దిగిన అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్‌కు అండగా నిలిచింది. సైనికసాయం చేస్తోంది. అయితే యుద్ధం మొదలైన తొలి వారంలోనే(2022లో) రష్యా అణుదాడికి సిద్ధమైంది. దీంతో ప్రపంచం ఉలిక్కపడింది. ఈమేరకు రష్యా కొన్ని అణ్వాయిదాలను తన పొరుగు దేశానికి తరలించింది. కూడా దీంతో అణుయుద్ధం ఖాయమని అంతా భావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే రష్యా అణుయుద్ధం భారత ప్రధాని నరేంద్రమోదీ చొరవతో విరమించుకుంది. దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
తాజాగా వెలుగులోకి..
రష్యా అణుబాంబు దాడి చేయకపోవడంలో భారత పాత్ర ఉందనే విషయం ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ ప్రముఖ వార్త సంస్థ సీఎన్‌ఎన్ ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించింది. రష్యా అణుదాడి చేయవచ్చని మొదట్లోనే తెలుసుకున్న అమెరికా దానిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై 2022లోనే పూర్తి కసరత్తు చేసింది. అణుదాడి జరిగితే జరిగే నష్టాన్ని అంచనా వేసింది.
భారత్ సాయం కోరి..
ఈ క్రమంలో అణుదాడిని అడ్డుకునే సత్తా ఒక్క భారత్‌కే ఉందని గుర్తించిన అమెరికా వెంటనే ఇండియా సాయం కోరింది. చైనాను కూడా రంగంలోకి దించింది. ఒకవైపు రష్యాను హెచ్చరిస్తూనే భారత్ ద్వారా రష్యాతో మంతనాలు సాగించారు. చైనా ద్వారా ఒత్తిడి తెచ్చారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విన్నపంతో రష్యా అధినేత పుతిన్ అణుయుద్ధాన్ని విరమించుకున్నాడు.
ఇటీవలే వెల్లడి..
రెండేళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని అమెరికా అధికారులు ఇటీవల సీఎన్‌ఎన్‌కు తెలిపారు. దీంతో ఆ సంస్థ ఓ కథనాన్ని ఇటీవల ప్రసారం చేసింది. మోదీ చొరవ తీసుకోకుంటే అణుయుద్ధం జరిగేదని తెలిపారు. మోదీ, పుతిన్ మధ్య ఉన్న సత్సంబంధాలే అణుయుద్ధాన్ని ఆపగలిగాయని వెల్లడించింది. గతేడాది ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతూ ‘ఇది యుద్ధ యుగం కాదు’ అని వ్యాఖ్యానించినట్లు గుర్తు చేసింది. మొత్తంగా మరో ప్రపంచ యుద్ధం మోదీ చొరవతో ఆగిపోవడం నిజంగా భారతీయులు గర్వించదగిన విషయం. కానీ ఈ విషయానికి భారత మీడియా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో చాలా మందికి విషయం తెలియడం లేదు.