https://oktelugu.com/

India’s population : చైనాను దాటేయనున్న భారత్ జనాభా?

India’s population  ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది అంటే ఇన్నాల్లు ‘చైనా’ పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ చోట ‘ఇండియా’ అని మన దేశం పేరు చెప్పుకోవాలి. ఎందుకంటే చైనాలో ‘ఒక బిడ్డనే ముద్దు’ కొన్ని సంవత్సరాల క్రితం రూల్ పెట్టడంతో జనాభా బాగా పడిపోయింది. ఇప్పుడు ఆ రూల్ తీసేసినా చైనా యువత మాత్రం కనడానికి ఇష్టపడడం లేదు. దీంతో చైనాలో జనాభా తగ్గిపోతుండగా.. భారత్ లో మాత్రం ఇద్దరు బిడ్డల […]

Written By:
  • NARESH
  • , Updated On : July 11, 2022 / 11:29 PM IST
    Follow us on

    India’s population  ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది అంటే ఇన్నాల్లు ‘చైనా’ పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ చోట ‘ఇండియా’ అని మన దేశం పేరు చెప్పుకోవాలి. ఎందుకంటే చైనాలో ‘ఒక బిడ్డనే ముద్దు’ కొన్ని సంవత్సరాల క్రితం రూల్ పెట్టడంతో జనాభా బాగా పడిపోయింది. ఇప్పుడు ఆ రూల్ తీసేసినా చైనా యువత మాత్రం కనడానికి ఇష్టపడడం లేదు. దీంతో చైనాలో జనాభా తగ్గిపోతుండగా.. భారత్ లో మాత్రం ఇద్దరు బిడ్డల పాలసీ బాగా అమలై జనాభా పెరిగిపోతోంది.

    ఈ క్రమంలోనే 2023 నాటికి చైనాను దాటేసి అత్యధిక జనాా గల దేశంగా భారత్ నిలిచిపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. 2022 ప్రపంచ జనాభా అంచనాల ప్రకారం.. ఐరాస తాజాగా నివేదిక రిలీజ్ చేసింది.

    ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు, భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166. కోట్లకు చేరుతుందని ఐరాసా తెలిపింది. చైనా జనాా 131.7 తగ్గుతుందని ఐరాస తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లను దాటుతుందని చెప్పింది.

    చైనాలో జననాల సంఖ్య భారీగా పడిపోయింది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పనిచేసే వారి సంఖ్య బాగా పడిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి.

    అదే భారత్ లో యువత భారీగా ఉందని.. చైనాను ఓవర్ టేక్ చేసి ప్రపంచ పరిశ్రమల కేంద్రంగా భారత్ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్ అంతా భారత్ దే అంటున్నారు.