New Raw Chief: మన పొరుగున ఉండే పాకిస్తాన్ తెలుసు కదా! ఎప్పుడూ మన దేశం మీద వివిధ రూపాల్లో దాడులు చేస్తూ ఉంటుంది. అప్పులు కట్టలేదు కానీ.. వివిధ దేశాలు దయాదాక్షిణ్యలతో ఇచ్చిన అప్పులతో మాత్రం రకరకాల ఉగ్ర విన్యాసాలకు పాల్పడుతూ ఉంటుంది. ఇక చైనా ఎలాంటి దుర్మార్గాలకు తెగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి దేశాల ఆగడాలు ఇకపై కుదరకపోవచ్చు.. వారు తమ దేశాల్లోనే ఉంటూ ఇక్కడ కుట్రలు చేసే అవకాశం దక్కకపోవచ్చు.. వీలుంటే వారు ఏదైనా ఒక ప్రమాదంలో దుర్మరణం చెందవచ్చు.. చదువుతుంటే ఓ యాక్షన్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ పైట్ లెవల్లో ఉంది కదూ.. అతిశయోక్తి అనుకున్నా పర్వాలేదు.. ఎందుకంటే ఆ వ్యక్తి అలాంటి వాడు మరి. ఆ వ్యక్తి పేరు రవి సిన్హా. భారత నిఘా (రీసర్చ్ అండ్ అనాలసిస్ “రా” )విభాగానికి కొత్త అధిపతి. ఈ మేరకు అతని నియమకానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం రా విభాగంలో రెండవ అత్యున్నత అధికారిగా కొనసాగుతున్నారు. గతంలో ఈయన పోలీస్ శాఖలో పనిచేసినప్పుడు చత్తీస్గడ్ లో మావోయిస్టులను ఏరి వేశారు. ఒకానొక దశలో వారందరినీ మోకాళ్ళ మీద నిలుచోబెట్టారు. మొన్నటికి మొన్న ఇద్దరు ఖలిస్తాన్ ఉగ్రవాదులను కాల్చి చంపారు.. ఇలా చెప్పుకుంటూ పోతే దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రవి సిన్హా ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్లు యాక్షన్ సినిమాకు మించి ఉంటాయి. అలాంటి వ్యక్తిని ప్రభుత్వం రా విభాగానికి అధిపతిని చేసింది.
ప్రస్తుతం రా చీఫ్ గా సమంత్ కుమార్ గోయల్ కొనసాగుతున్నారు. ఆయన ఈ నెల 30న పదవి విరమణ చేయబోతున్నారు.. ఆయన స్థానంలో రవిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1988 బ్యాచ్ చెందిన రవి సిన్హా ట్రాక్ రికార్డ్ చెప్పాలంటే గురించి చెప్పాలంటే అద్భుతం అనే మాట కూడా చిన్నదవుతుంది.. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ఎన్నో కీలకమైన ఆపరేషన్లలో రవి ముఖ్యపాత్ర పోషించారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశానికి విఘాతం కలిగించే శక్తులను తుద ముట్టించారు. రవి గత ఏడు సంవత్సరాలుగా రా విభాగంలో సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో రవి విద్యాభ్యాసం పూర్తి చేశారు. రా విభాగంలో పని చేస్తున్నందున రవికి సంబంధించిన చాలా వివరాలు రహస్యంగా ఉన్నాయి. దేశంలోనే అత్యంత కీలకమైన బాధ్యత విభాగంలో పనిచేసే అధికారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అత్యంత గోప్యం గా ఉంటుంది. అందుకే అధికారులు ఆ వివరాలను బయటకు వెల్లడించరు.
రవి రా విభాగంలో పలు శాఖల్లో కీలక సేవలు అందించారు. అత్యంత ప్రతిభావంతుడిగా పేరుంది. విదేశాల్లో జరిగే పరిణామాల మీద రవికి మంచి పట్టు ఉంది. అందువల్లే అయనకు ఈ పదవి కట్టబెట్టారు. రవి ఈశాన్య భారత్, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు పని చేశారు. ముఖ్యంగా తన సొంత రాష్ట్రమైన చత్తీస్గడ్ లో నక్సల్స్ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించగలిగారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వల్ల మావోయిస్టుల సమస్య మళ్ళీ పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు చైనా ఆక్రమణల విషయాన్ని ఎప్పటికప్పుడు భారతదేశానికి చేరవేశారు. రవి గనుక ఒకవేళ ఈశాన్య రాష్ట్రాల్లో పని చేస్తూ ఉంటే గాల్వాన్ లోయ ఘటన జరిగి ఉండేది కాదని ఇప్పటికీ రా విభాగంలో చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పటివరకు రా చీఫ్ గా ఉన్న గోయల్ పదవి కాలాన్ని ప్రభుత్వం పలు మార్లు పెంచింది. ఇక రా విభాగం విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను అత్యంత రహస్యంగా పర్యవేక్షిస్తుంది. రవి నియామక విషయంలో నరేంద్ర మోదీ అత్యంత ఆసక్తి చూపించారంటే అతడి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.