Director Lokesh Kanagaraj: ఆయన ఊ అంటే స్టార్ హీరోలు రెడీగా ఉన్నారు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఇమేజ్ ఆకాశానికి చేరింది. టాలీవుడ్ స్టార్స్ సైతం లోకేష్ తో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంత డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఏకంగా పరిశ్రమను వదిలిపోతానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. లోకేష్ కనకరాజ్ తాజా ఇంటర్వ్యూలో ఈ మేరకు సంచలన కామెంట్స్ చేశాడు. నేను సుదీర్ఘ కాలం పరిశ్రమలో ఉండిపోవాలని అనుకోవడం లేదు. ఓ పది చిత్రాల అనంతరం పరిశ్రమ నుండి వెళ్ళిపోతాను.
సినిమాపై మక్కువతో షార్ట్ ఫిల్మ్స్ తీశాను. అవి సక్సెస్ కావడంతో గురి కుదిరింది. దర్శకుడిని అయ్యాను. ఇక సినిమాటిక్ యూనివర్స్ లో మూవీస్ చేయడం అంత సులభం కాదు. ప్రతి విషయాన్ని తరచి చూసుకోవాలి. సదరు సినిమా నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ నుండి ఎన్ ఓ సి తెచ్చుకోవాలి. విజయ్ అన్నతో రెండోసారి పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరో పది రోజుల్లో విజయ్ పోర్షన్ అయిపోతుంది. లియో సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా లేక వేరే సినిమానా అనేది మీకు చూశాక తెలుస్తుంది. నాతో పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.
విజయ్ తో లోకేష్ కనకరాజ్ లియో చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంది. అక్టోబర్ లో మూవీ విడుదల కానుంది. విజయ్ కి జంటగా త్రిషా నటిస్తుంది. భారీ తారాగణం లియో మూవీలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ తెరకెక్కించారు. లియో కూడా అందులో భాగమే అని సమాచారం.
కాగా లోకేష్ కనకరాజ్-రామ్ చరణ్ కాంబోలో మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ సెట్ కావాలని కోరుకుంటున్నారు. నెలల వ్యవధిలో చిత్రాన్ని పూర్తి చేసే లోకేష్ కనకరాజ్ కి రామ్ చరణ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం కలదు. అలాగే లోకేష్ కనకరాజ్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రేజ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటో చూడాలి.