https://oktelugu.com/

కరోనా చేస్తున్న మంచి పనేంటో తెలుసా?

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ అమలుతో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. నిత్యావసర సరుకుల దుకాణాలు, ఆసుపత్రులు, మెడికల్ షాపులు తదితర మినహా అన్ని మూతపడ్డాయి. అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ కఠినంగా అమలు చేయడంతో ప్రజా రవాణా స్తంభించింది. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు పూర్తిగా తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా వాయుకాలుష్యం తగ్గినట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో జనసంచారం, వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోవడంతో కాలుష్యం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 4, 2020 / 07:26 PM IST
    Follow us on


    దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ అమలుతో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. నిత్యావసర సరుకుల దుకాణాలు, ఆసుపత్రులు, మెడికల్ షాపులు తదితర మినహా అన్ని మూతపడ్డాయి. అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ కఠినంగా అమలు చేయడంతో ప్రజా రవాణా స్తంభించింది. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు పూర్తిగా తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా వాయుకాలుష్యం తగ్గినట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడించింది.

    హైదరాబాద్‌లో జనసంచారం, వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోవడంతో కాలుష్యం కూడా తగ్గింది. గడిచిన ఇరవై ఏళ్లలో 100నుంచి 54కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గడం ఇదే ప్రథమమని కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు నుంచి ప్రతీరోజు భారీగా కాలుష్యం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో చేయడంతో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో నగరంలో వాయికాలుష్యం తగ్గినట్లు తెలుస్తోంది.

    లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజలు అనవసరంగా వాహనాలు వాడకుండా ఉంటే నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అనవసరంగా వాహనాలను రోడ్లపైకి తీసుకొచ్చి కాలుష్యాన్ని పెంచొద్దని పర్యావరణ వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లోనూ వాయుకాలుష్యం తగ్గినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మరి దాటికి ఎక్కడి వారక్కడే గప్ చుప్ కావడంతో కాలుష్యం తగ్గింది. కరోనా వల్ల మనవాళికి చెడు జరుగుతుండగా పర్యావరణానికి మాత్రం మేలు జరుగుతుండటంపై సంతోషించాలా? లేక విచారించాలో తెలియని పరిస్థితి నెలకొంది.