Indian Women Career Vs Marriage Expectations: ఆధునిక భారతదేశంలో టెక్నాలజీ, కెరీర్‌లో మహిళలు ముందంజలో ఉన్నారు. టెక్నాలజీ పరంగా అప్‌డేట్ అవుతున్నారు. అయితే అత్తను ఆదరించడంతో, అదే అత్త హోదాను అనుభవించడంతో వెనుకబడుతున్నాఉ. తాము కోడలిగా ఎంజాయ్ చేస్తున్నారు. తమ కోడల్ ఎంజాయ్ చేస్తే మాత్రం సంప్రదాయాలు అని ఆంక్షలు పెడుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన మ్యాట్రిమోనియల్ యాప్ సీఈఓ జస్వీర్ సింగ్ షేర్ చేసిన పోస్ట్ ఈ సమస్యను స్పష్టం చేసింది.
వైరల్ పోస్ట్..
జస్వీర్ సింగ్ తన సోషల్ మీడియాలో ఢిల్లీ చందీగఢ్‌కు చెందిన ఒక తల్లి ప్రొఫైల్‌ను పోస్ట్ చేశారు. ఆమె కొడుకు సంవత్సరానికి రూ.75 లక్షలు సంపాదిస్తున్నాడు. అయినా కోడలు పెళ్లి తర్వాత ఉద్యోగం వదులుకోవాలని కట్టుబాటు విధించింది.
డిమాండ్ కారణాలు..
మంచి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉన్నా, అందమైన ఫిగర్, మంచి కుటుంబ నేపథ్యం ఉన్న అమ్మాయి. ఆమె కెరీర్‌కు కాకుండా ఇల్లు, కుటుంబ బాధ్యతలకు మొదటితేడా ఇవ్వాలి. ఈ డిమాండ్‌లు ఆధునిక కుటుంబాల స్వభావాన్ని ప్రశ్నిస్తున్నాయి.
సీఈవో ఆగ్రహం..
జస్వీర్ సింగ్ ఈ ఆలోచనను 1950ల మనస్తత్వంతో సమానం చేశారు. చదువు, అందం, కానీ విధేయత కోరుకునే మనస్తత్వం యువకుల్లో పెద్దలు నాటుతున్నారని ఆరోపించారు. ఆధునికత చెప్పుకుని సమానత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రొఫైల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మహిళలు చదువుకుని స్వతంత్రంగా ఉంటే వివాహ మార్కెట్‌లో ’హోమ్లీ’ గుణాలు మాత్రమే కోరుకుంటున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తాయి. పెద్దల ఆలోచనలు మారకపోతే యువతలో మార్పు రాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
కెరీర్, విద్యలో అభివకృద్ధి ఉన్నా వివాహాల్లో మహిళలను ఇంటి పరిమితుల్లో ఉంచాలనే ఆశయాలు సమాజాన్ని వెనక్కి నెట్టుతున్నాయి. భార్యాభర్తల మధ్య సమాన భాగస్వామ్యత ఏర్పడాలంటే మనస్తత్వ మార్పు తప్పనిసరి.