Indian Railways: మరో పది, 15 రోజుల్లో వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు కూడా సెలవులు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో చదువుల కోసం సొంత ఊళ్లను వదిలి నగరాలు, పట్టణాలకు వచ్చిన విద్యార్థులు ఇక ఇళ్లకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులుకు టికెట్‌పై కన్సీజన్ ఇస్తున్నట్లు తెలిపింది. 50 శాతం నుంచి 75 శాతం వరకు చార్జీపై డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. అయితే దీనిని ఎలా వినియోగించుకోవాలి, ఏమేం వివరాలు కావాలి అనే వివరాలు తెలుసుకుందాం.
స్టూడెంట్ కన్సీజన్..
ఇండియన్ రైల్వేస్ స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేక రాయితీ ప్రకటించింది. దీని ప్రకారం ప్రతీ విద్యార్థి టికెట్ చార్జీలో డిస్కౌంట్ పొందవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులకు ప్రయాణ చార్జీలో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే ప్రయాణ చార్జీలో 75 శాతం వరకు రాయితీ ఇస్తుంది.
ఇవీ కండీషన్లు..
– రైల్వేలో అన్ని టికెట్లకు డిస్కౌంట్ వర్తించదు. జనరల్, స్లీపర్ క్లాస్ టికెట్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
– విద్యార్థుల వయసు 25 ఏళ్ల కన్నా తక్కువ ఉండాలి. కొన్ని కండీషన్స్‌లో 35 ఏళ్ల వరకు ఉండొచ్చు.
– ఇక ఈ రాయితీ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం లేదు. రైల్వే స్టేషన్లలోని టికెట్ బుకింగ్ కౌంటర్లకు వెళ్లి తీసుకోవాల్సిందే.
– ఇక రాయితీ కావాలంటే.. ముందుగా రైల్వే బుకింగ్ కౌంటర్‌లో ఇచ్చే దరఖాస్తు ఫాంలో వివరాలు నింపి, ప్రిన్సిపాల్ సంతకం తీసుకుని రావాల్సి ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు రైల్వే డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగించుకోండి.