Indian physician accompanying Indian students in Ukraine: ఉక్రెయిన్ లో ఇప్పుడు అందరినీ చావు భయం వెంటాడుతోంది. రష్యా ప్రకటించిన యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడుతామా? లేదా? అన్న ఆందోళన నెలకొంది. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం దాటడానికి చాలామంది ప్రజలు పరుగులు పెడుతున్నారు. భారతీయులు కాలినడకన, వాహనాల్లో సరిహద్దుల వరకూ చేరుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం బాంబుల మోత మోగిస్తోంది. కానీ ఉక్రెయిన్ లోనే ఉంటున్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు దేశం వచ్చే మార్గం లేక.. ఆదేశంలో ఉండలేక నరకయాతన పడుతున్నారు. ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి పారిపోవడం కంటే.. ఆ ఇబ్బందులు పడే కంటే ఆ దేశంలోనే యుద్ధ ప్రాంతాలకు వ్యతిరేకంగా బంకర్లలో తలదాచుకోవడం మేలు చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.
అక్కడి భారతీయులంతా కూడా స్వదేశానికి రావడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తుంటే.. భారత డాక్టర్ 37 ఏళ్ల డా. పృథ్వీరాజ్ ఘోష్ మాత్రం ధైర్యంగా నిలబడ్డారు. తాను ఉక్రెయిన్ ను వదిలి రానని తెగేసి చెబుతున్నాడు. తాను బోధించిన వైద్య విద్యార్థులకు తోడుగా ఉక్రెయిన్ లోనే ఉంటానని చెబుతున్నారు.
భారత విద్యార్థులందరినీ దగ్గరకు చేర్చి వారికి భరోసానింపుతూ డా.ఫృథ్వీ రాజ్ ఘోష్ బంకర్ లో వాళ్లతోనే ఉంటూ వారికి సౌకర్యాలు కల్పిస్తూ భరోసా నింపుతున్నారు. ‘తాను రాజధాని కీవ్ లోనే ఉన్నానని.. నేను విద్యార్థులను వదిలి దేశానికి ఒంటరిగా పోనని.. ఇక్కడే చిక్కుకుపోయిన 350 మంది విద్యార్థులకు తోడుగా కీవ్ నగరంలోనే ఉంటానని చెబుతున్నాడు.
ఈ డాక్టర్ అంతటి యుద్ధ సమయంలోనూ ప్రాణభయంతో భిక్కుభిక్కుమంటున్న విద్యార్థులకు తోడుగా అక్కడే ఉండిపోవాలనుకున్న అతడి నిర్ణయానికి ప్రశంసలు కురుస్తున్నాయి.
[…] Also Read: ఉక్రెయిన్ లో భారత విద్యార్థుల రక్షణక… […]