ప్రపంచంలోని మేటి కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు తయారైంది మన ఇండియన్ ఐఐటీల్లోనే. ఇక్కడ చదువుకొని వారు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను నడిపిస్తున్నారు. అంతటి ఘనత వహించిన మన ఐఐటీలు ఇప్పుడు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారిపై ఫైట్ కు రెడీ అయ్యాయి. భారతదేశాన్ని కాపాడే బాధ్యతను భుజానకెత్తుకున్నాయి.
కరోనా మహమ్మారి అంతానికి ఐఐటీలు, ఎన్ఐటీలు ఏడాది కాలంగా పరిశోధనలు జరుపుతున్నాయి. కరోనా కట్టడికి అనువుగా వైద్యులు, పోలీసులు, ఔషధ రంగానికి అవసరమైన పరికరాలు రూపొందిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా సామాన్యుడికి తక్కువ ధరలో రక్షణ పరికరాలు రూపొందిస్తున్నారు.
కరోనా తీరుతెన్నులు, తగ్గుదల, వ్యాప్తి వంటి అంశాలపై కృత్రిమ మేథ, గణిత నమూనాలను వినియోగించి ముందుగానే అంచనావేస్తూ ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నాయి.
ఇప్పటికే ఇండియాలో మొదటి వేవ్ వచ్చినప్పుడే ఇండియన్ ఐఐటీలు ఈ వైరస్ పరిశోధనలకు శ్రీకారం చుట్టాయి. ఏడాది కిందటే 190 ప్రాజెక్టులు చేపట్టాయి. ఇప్పుడు వాటి సంఖ్య 271కి చేరింది. ఎన్ఐటీలు కూడా 176 ప్రాజెక్టులు చేపట్టి పరిశోధన కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఐఐటీహెచ్ పరిశోధకులు తయారు చేసిన హ్యాండ్ , మాస్కు శానిటైజర్లతోపాటు పరిసరాలను క్రిమిరహితం చేసే యాంటీ వైరస్ కోటింగ్ సొల్యూషన్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆవిష్కరించారు.
ఇలా వైరస్ పై పోరాటానికి స్వదేశీ సూపర్ స్టడీ వ్యవస్థలు ఐఐటీలు పోరుబాటకు శ్రీకారం చుట్టాయి. దాదాపు 271 ప్రాజెక్టులు చేపట్టాయి. అవన్నీ కార్యరూపం దాల్చితే ఇక కరోనాను దేశం కట్టడి చేసేయగలదు.