Indian Army rescue: భారతదేశంపై శత్రువుల దాడిని ఎదుర్కోవడానికి సైన్యం నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. ఇండియాలో ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి శత్రువు దేశాల నుంచి వచ్చే దాడులను తట్టుకొని తమ ప్రాణాలైనా పరంగా పెట్టి దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అయితే యుద్ధంలో పాల్గొనడమే కాకుండా.. విరోచితంగా పోరాడమే కాకుండా.. అప్పుడప్పుడు మానవ హృదయంతో సహాయం కూడా చేస్తూ ఉంటారు. దేశ ప్రజలను మాత్రమే కాకుండా దేశంలోని కొన్ని జీవులకు కూడా ఆర్మీ జవాన్ రక్షణగా ఉంటుందని తాజాగా నిరూపించింది. హిమాలయాల్లోని ఒక ఎలుగుబంటి ఆపద సమయంలో ఉంటే భారత సైన్యం ప్రాణాలకు తెగించి దానిని కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఈ వీడియోలో ఏముంది?
ప్రస్తుతం చలికాలం కావడంతో భారతదేశంలోని హిమాలయాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ ప్రదేశంలో జీవించడమే కష్టతరమైన పని. కానీ భారత సైన్యం ప్రాణాలకు తెగించి ఇక్కడ దేశానికి రక్షణగా ఉంటుంది. నిత్యం శత్రువుల జాడ దేశంలోకి చొరబడకుండా కాపాడుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఇతర ప్రాణులకు కూడా హాని కలగకుండా కాపాడుతుంటుంది. ఇందులో భాగంగా హిమాలయాల్లోని ఓ ప్రాంతంలో బ్రౌన్ కలర్ ఎలుగుబంటి ఆపదలో చిక్కుకుంది. చిన్న వయసు కలిగిన ఎలుగుబంటి తల ఒక డబ్బాలో చిక్కుకుంది. దీంతో దాని దారి తెలియక ఇబ్బంది పడుతోంది. అంతేకాకుండా దానికి శ్వాస కూడా ఆడడం లేదు.
దీనిని గుర్తించిన భారత సైన్యం వెంటనే అక్కడికి వెళ్లి.. చాలా కష్టపడి డబ్బులు ఎలాగోలా తీశారు. ఈ సంఘటనలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో పై అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో కూడా భారత సైన్యం తమ సేవలను అందించడం విశేషం అంటూ కీర్తిస్తున్నారు. అంతేకాకుండా భారత సైన్యానికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కొందరు ఇలా తలలో డబ్బా ఇరుక్కుంటే డబ్బాను కోయడమో.. లేదా ఇతర మార్గాలను అన్వేషించేవారు. కానీ భారత సైన్యం తెలివిగా ఎలుగుబంటి కి ఎలాంటి ప్రమాదం జరగకుండా డబ్బాను బయటికి తీశారు. దీంతో దానికి కొత్త జీవితాన్ని అందించినట్లు అయిందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం ప్రస్తావించలేదు. కానీ వీడియోలో చూస్తే మాత్రం చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని తెలుస్తుంది. అంతేకాకుండా భారత సైన్యం ఇక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి భారత రక్షణ కోసం సైన్యం ఎంతగా ప్రాణాలకు తెగిస్తుందో అర్థం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు.
Indian army troops rescuing a Himalayan bear somewhere near their forward post pic.twitter.com/nntLEnn0se
— KiloMike2 (@TacticalKafir) November 24, 2024