OG Movie Closing Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లీన్ హిట్ గా నిల్చిన చిత్రం ఇదే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. కానీ వకీల్ సాబ్ చిత్రం రన్నింగ్ సమయం లో కరోనా సెకండ్ వేవ్ తారా స్థాయిలో ఉండడం తో పది రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ని మూసివేశారు. ఫలితంగా బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరగా వచ్చి ఆగింది ఈ చిత్రం. ఇక భీమ్లా నాయక్ ఆంధ్ర ప్రదేశ్ లో తప్ప, అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడానికి కారణం అతి తక్కువ టిక్కెట్ రేట్స్.
ఓజీ కి అలాంటి సమస్యలు ఏమి లేవు. పబ్లిక్ నుండి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రానికి మొదటి రోజున ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ తో మొదలైన ఈ చిత్రం ఎట్టకేలకు థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో మైనర్ నష్టాలతో ముగిసిన ఈ చిత్రం, నైజాం, ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కనీవినీ ఎరుగని లాభాలను మూటగట్టుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో 200 శాతం లాభాలు అంటే నమ్ముతారా?, ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా ఇంతటి లాభాలు రాలేదు. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రాయలసీమ ప్రాంతం లో 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం లో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 12 కోట్ల 30 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 8 కోట్ల 50 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 10 కోట్లు, గుంటూరు జిల్లా నుండి 11 కోట్ల 20 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 216 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 30 లక్షలు, ఓవర్సీస్ నుండి 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 189 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 316 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.