https://oktelugu.com/

2050 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్

కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూల్చింది. మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఏకంగా మైనస్ లలోకి చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు -9 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఎస్ అంద్ పీ అంచనావేసింది.తాజాగా ఎస్ అండ్ పీ రేటింగ్ ఏజెన్సీ ఈ ఆర్థిక సంవత్సరంలో -9 గా భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ భారీగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 / 09:57 AM IST
    Follow us on

    కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూల్చింది. మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఏకంగా మైనస్ లలోకి చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు -9 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఎస్ అంద్ పీ అంచనావేసింది.తాజాగా ఎస్ అండ్ పీ రేటింగ్ ఏజెన్సీ ఈ ఆర్థిక సంవత్సరంలో -9 గా భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ భారీగా తగ్గుతుందని తెలిపింది. ఆ తర్వాత 2021-22లో మాత్రం భారీగానే పుంజుకుంటుందని పేర్కొంది.

    అయితే భవిష్యత్ మాత్రం ఆశాజనకంగానే ఉంటుందనే భరోసాను రేటింగ్ సంస్థలు కల్పిస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ ఆర్థిక శక్తిగా భారత్ చేరుకుంటుందని ఓ అధ్యయనం తేల్చింది.

    ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్1 ఆర్థిక శక్తిగా అమెరికా ఉంది. ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది. ఇప్పుడు అమెరికాను కూడా చైనా దాటేయడానికి రెడీ అయ్యింది. మూడో స్థానంలో జపాన్, నాలుగో స్థానంలో జర్మనీ ఉన్నాయి. ప్రస్తుతం ఐదోస్థానంలో భారత్ ఉంది. అయితే 2050 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి భారత దేశం మూడోస్తానానికి చేరుకోనున్నట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైన ఓ తాజా అధ్యయనంలో తెలిసింది.

    ప్రస్తుతం పలుదేశాల్లో పనిచేస్తున్న జనాభా, వారి వయసు, దేశస్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా ఈ పరిశోధన జరిగింది. 2017లో భారత్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 5వస్థానంలో కొనసాగుతోంది. ఈ గణాంకాల ఆధారంగానే పరిశోధకులు తాజా అధ్యయనం చేశారు. 2030 నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి.. 2050 నాటికి ఇండియా 3వ స్థానానికి చేరుకుంటుందని అధ్యయనం పేర్కొంది.