https://oktelugu.com/

‘ఆదిపురుష్’లో ఆదిదేవుడిగా అజయ్ దేవగణ్?

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆదిపురుష్’ వరల్డ్ వైడ్ గా రాబోతుంది. ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే సినీప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోెంది. అత్యంత భారీ బడ్జెట్లో.. గ్రాఫిక్స్ మాయజాలంతో ‘ఆదిపురుష్’ ను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్నాడు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా టీ సీరిస్ ‘ఆదిపురుష్’ను నిర్మించనుంది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ మాయజాలం ప్రధాన ఆకర్షణ నిలువనుంది. Also Read: నవదీప్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 / 10:10 AM IST
    Follow us on

    యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆదిపురుష్’ వరల్డ్ వైడ్ గా రాబోతుంది. ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే సినీప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోెంది.

    అత్యంత భారీ బడ్జెట్లో.. గ్రాఫిక్స్ మాయజాలంతో ‘ఆదిపురుష్’ ను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్నాడు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా టీ సీరిస్ ‘ఆదిపురుష్’ను నిర్మించనుంది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ మాయజాలం ప్రధాన ఆకర్షణ నిలువనుంది.

    Also Read: నవదీప్ మీద పడ్డ జగన్ ఫ్యాన్స్ !

    ‘ఆదిపురుష్’ చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది. ‘బాహుబలి’లో అమరేంద్ర బాహుబలిగా అలరించిన ప్రభాస్.. ఆదిపురుష్ లో రాముడిగా నటించబోతున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా ఫస్టు లుక్ ఇప్పటికే సన్సేషన్ క్రియేట్ చేసింది.

    రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. అదేవిధంగా అజయ్ దేవగణ్ ఇందులో ఒక ముఖ్య పాత్రలో కన్పించబోతున్నాడు. అయితే ఆయన ఆదిదేవుడు(శివుడి) పాత్రలో నటిస్తారనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: చంటి అడ్డాలపై ఫైర్ అయిన నిర్మాత న‌ట్టికుమార్

    ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. సైట్స్ పైకి వెళ్లక ముందే సోషల్ మీడయాలో ‘ఆదిపురుష్’ హల్చల్ చేస్తుంది. ఇక సినిమా ప్రారంభమైతే ఈ జోష్ రెట్టింపు అవడం ఖాయమని అభిమానుల్లో చర్చ నడుస్తోంది.