Homeఅంతర్జాతీయంChina Water Bomb India: భారత్‌పై చైనా వాటర్‌ బాంబ్‌.. జలయుద్ధం తప్పదా?

China Water Bomb India: భారత్‌పై చైనా వాటర్‌ బాంబ్‌.. జలయుద్ధం తప్పదా?

China Water Bomb India: డ్రాగన్‌ కంట్రీ చైనా.. తన ఎదుగుదల కోసం అడ్డువచ్చే దేశాలతోపాటు, ఇరుగు పొరుగు దేశాలను అణచివేయాలని చూస్తోంది. మనం ఎదగకపోయినా మంచిదే.. ఎదుటివాడు ఎదగకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చైనా ప్రపంచంలో నంబర్‌ 2 స్థానంలో ఉంది. అమెరికాను కొట్టాలని చూస్తోంది. ఇదే సమయంలో ఆసియాతో తనకు పోటీగా ఉన్న భారత్‌ను దెబ్బ తీసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. చైనా ఉత్పత్తులను భారత్‌లోకి డంప్‌ చేసింది. దీనికి మోదీ సర్కార్‌ చెక్‌ పెట్టింది. తర్వాత అనేక మోసపూరిత యాప్స్‌తో మన సంపదను కొల్లగొట్టింది. దీనికి భారత్‌ బ్రేక్‌ వేసింది. ఇప్పుడు దొడ్డిదారిన భారత రహస్యాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో టిబెట్, చైనా, భారత్‌లో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణం మొదలు పెట్టింది. ఈ డ్యాంతో భూగమనంలో మార్పు వస్తుందని శాస్తవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద డ్యాం చైనాలో ఉంది. దానిని మించిన డ్యాం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది.

Also Read: ఆపరేషన్ సింధూర్.. అస్సలు తగ్గే ప్రసక్తే లేదు!

ఐదు దశల్లో నిర్మాణం..
చైనా బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యామ్‌ నిర్మాణాన్ని ఐదు దశల్లో చేపడుతోంది. ఈ డ్యామ్‌ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక జలవిద్యుత్‌ ఉత్పత్తి సాధించాలని డ్రాగన్‌ కంట్రీ లక్ష్యంగా పెట్టుకుంది. బ్రహ్మపుత్ర బేసిన్‌లో 50 శాతం చైనా ఆధీనంలో ఉండగా, క్యాచ్‌మెంట్‌ ఏరియాలో చైనాకు 34 శాతం, భారత్‌కు 39 శాతం వాటా ఉంది. ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా చైనా ఎగువ రైపేరియన్‌ దేశంగా, భారత్‌ లోయర్‌ రైపేరియన్‌ దేశంగా ఉంది. ఈ డ్యామ్‌ నిర్మాణం భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చైనా డ్యామ్‌ నిర్మాణంతో భారీ వర్షాల సమయంలో అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాంలో వరదలు సంభవించే అవకాశం ఉంది, దీనివల్ల భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అదే సమయంలో, కరువు కాలంలో ఈ రాష్ట్రాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. హిమాలయ ప్రాంతంలో ఈ డ్యామ్‌ నిర్మాణం భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డ్యామ్‌ పగిలిపోతే, ఈశాన్య రాష్ట్రాలు నామరూపం లేకుండా పోయే ప్రమాదం ఉంది.

జల ఒపపందం లేకుండానే..
ఐక్యరాజ్య సమితి యొక్క ఇంటర్నేషనల్‌ వాటర్‌ కోర్సెస్‌ కన్వెన్షన్‌ ప్రకారం, రెండు లేదా మూడు దేశాల మీదుగా ప్రవహించే నదుల నీటి పంపిణీపై ఒప్పందం ఉండాలి. అయితే, 1997లో చైనా, టర్కీ, బురుండీ వంటి దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. దీని ఫలితంగా, చైనా భారత్‌ అనుమతి లేకుండానే బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్‌ నిర్మిస్తోంది. భారత్, చైనా మధ్య నీటి పంపిణీపై ఎలాంటి ఒప్పందం లేకపోవడం భారత్‌కు ప్రతికూలంగా మారనుంది.

చైనా లక్ష్యాలు ఇవీ..
చైనా ఈ డ్యామ్‌ ద్వారా జలవిద్యుత్‌ ఉత్పత్తిని పెంచడమే కాకుండా, బ్రహ్మపుత్ర నీటిని తన ఉత్తర ప్రాంతాలకు తరలించే యోచనలో ఉంది. ఇది థర్మల్‌ పవర్‌ ఉత్పత్తిని తగ్గించి, కాలుష్యాన్ని నియంత్రించడానికి చైనా చేపడుతున్న చర్యల్లో భాగం. అయితే, ఈ వ్యూహం భారత్‌కు నీటి కొరతను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చైనా ఎగువ రైపేరియన్‌ దేశంగా ఉండడం వల్ల ఎల్లప్పుడూ లాభపడే అవకాశం ఉంది, దీనివల్ల భారత్, నేపాల్‌ వంటి లోయర్, మిడిల్‌ రైపేరియన్‌ దేశాలు నష్టపోయే ప్రమాదం ఉంది.

Also Read: అమెరికా, నాటో, ఈయూ బెదిరింపులు.. భారత్ తగ్గేదేలే

చర్చలు జరిపితేనే సమస్య పరిష్కారం..
ఈ డ్యామ్‌ నిర్మాణంతో సంభవించే ప్రమాదాలను ఎదుర్కోవడానికి భారత్, చైనా మధ్య నీటి పంపిణీ ఒప్పందం అవసరం. ఒప్పందంలో నష్ట బాధ్యత, నీటి విడుదల నియమాలు, భూకంప ప్రమాదాల నివారణ వంటి అంశాలు స్పష్టంగా పేర్కొనాలి. ఇప్పటికే సరిహద్దు వివాదాలు, టిబెట్, తైవాన్‌ అంశాలపై ఉన్న విభేదాల నేపథ్యంలో, నీటి సమస్య కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. ఒకవేళ ఈ సమస్యపై చర్చలు జరగకపోతే, భారత్‌–చైనా మధ్య నీటి యుద్ధం సంభవించే అవకాశం ఉంది.

YouTube video player

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version