India Today Best Chief Minister Survey: ఈ ఏడాది కూడా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తొలి మూడు స్థానాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh chief minister Yogi Adityanath), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee), తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Tamil Nadu chief minister Stalin) నిలిచారు. నాలుగు ఐదు, ఆరు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu), మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Maharashtra chief minister Devendra fadnavis), కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka chief minister siddaramaiah) నిలిచారు. పరిపాలన, శాంతి భద్రతలు, మంత్రివర్గం కూర్పు, అందుతున్న పథకాలు, అభివృద్ధి, వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చు, శాంతి భద్రతలు, వ్యవహార శైలి, ప్రజలతో మమేకం అవుతున్న తీరు వంటి అంశాల ఆధారంగా ఇండియా టుడే సర్వే నిర్వహించింది.. ఈ సర్వేలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన వరుసగా ప్రథమ స్థానంలో ఉంటూ వస్తున్నారు. మెరుగైన పరిపాలన, శాంతిభద్రతల పర్యవేక్షణ, పథకాల అమలు తీరు, మంత్రివర్గం కూర్పు వంటి విషయాలలో యోగి ఆదిత్యనాథ్ ను ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆమోదించారని.. ఆయన పరిపాలన బాగుందనే కితాబు ఇచ్చారని ఇండియా టుడే తన సర్వేలో వెల్లడించింది..
సిద్ధరామయ్య కు స్థానం.. మరి రేవంత్?
ఇండియా టుడే సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు నాలుగో స్థానం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆరో స్థానం లభించింది. సిద్ధరామయ్య పై ఇటీవల అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ.. కర్ణాటక ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలపరచడం విశేషం. మెరుగైన పరిపాలన అందిస్తున్నారని చెప్పడం గమనార్హం. ఇక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోయినప్పటికీ.. భవిష్యత్తు దృష్ట్యా ఆయన పరిపాలన అవసరమని మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. పథకాలు లేకపోయినా పర్వాలేదు.. అభివృద్ధి ఉండాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోవడం విశేషం. పథకాలు అమలు చేస్తున్నప్పటికీ.. అభివృద్ధి పరంగా అడుగులు వేస్తున్నప్పటికీ.. తెలంగాణ ప్రజలు ఆయనపై అంతగా నమ్మకాన్ని ప్రదర్శించలేదు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆయన ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన పేరు ఎన్నడూ లేదు. కాగా, నారా చంద్రబాబు నాయుడుకు నాలుగో స్థానం రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మెరుగైన పరిపాలనకు.. అభివృద్ధి చేస్తున్న దార్శనికుడికి దక్కిన గౌరవం ఇదంటూ టిడిపి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే..
ఇండియా టుడే సర్వేలో యోగి ఆదిత్యనాథ్ 35.3, మమత బెనర్జీ 10.6, స్టాలిన్ 5.2, నారా చంద్రబాబునాయుడు 5.1, దేవేంద్ర ఫడ్నవిస్ 4, సిద్ధరామయ్య 3.5, హిమంత బిశ్వ శర్మ 3.4, నితీష్ కుమార్ 3.4, మోహన్ యాదవ్ 2.2 శాతం ఓట్లు సాధించారు.