Homeజాతీయ వార్తలుIndia Wealth Growth Trends 2026: భారత్ లో పెరగనున్న ధనికులు..

India Wealth Growth Trends 2026: భారత్ లో పెరగనున్న ధనికులు..

India Wealth Growth Trends 2026: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత్‌లో ధనికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ Knight Frank అంచనా వేసింది. సంస్థ విడుదల చేసిన The Wealth Report 2026 ప్రకారం దేశ ఆర్థిక వృద్ధి, కొత్త పెట్టుబడులు, స్టార్టప్‌ల పెరుగుదల ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే..

2026 నాటికి భారత్‌లో 207 మంది బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది. అయితే 2031 నాటికి ఈ సంఖ్య 313కి పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇది దాదాపు 51 శాతం వృద్ధి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐటీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఫార్మా వంటి రంగాల్లో విస్తరణ వల్ల సంపద సృష్టి వేగంగా జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఈ వృద్ధి మరింత వేగంగా ఉండనుంది. చైనాలో బిలియనీర్ల సంఖ్య 20 శాతం వరకు పెరుగుతుందని, అమెరికాలో 12 శాతం వృద్ధి నమోదవుతుందని నివేదిక వెల్లడించింది. దీంతో గ్లోబల్ స్థాయిలో భారత్ ఒక కీలక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నట్లు ఈ అంచనాలు సూచిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. రోజుకు సగటున 89 మంది కనీసం 30 మిలియన్ డాలర్ల (సుమారు రూ.250 కోట్లకు పైగా) సంపద కలిగిన అల్ట్రా రిచ్‌గా మారుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది గ్లోబల్ సంపద సృష్టి వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ బిలియనీర్ల సంఖ్య ప్రస్తుతం 3,110గా ఉండగా, వచ్చే ఐదేళ్లలో అది 3,915కి పెరుగుతుందని అంచనా. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఎకానమీ రంగాల్లో భారీ పెట్టుబడులు రావడం వల్ల కొత్త సంపద సృష్టి మరింత వేగవంతమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా భారత్‌లో బిలియనీర్ల సంఖ్య పెరగడం దేశ ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తుండగా, గ్లోబల్ స్థాయిలో సంపద పంపిణీలో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version