India Pakistan Ceasefire: పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో 9 ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యారు. ప్రతిగా పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడిచేసింది. దీనిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో ప్రతిదాడులతో దాయాదిని బెంబేలెత్తించింది. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి దిగి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మే 18(ఆదివాంర)తో ముగియనుండటంతో, రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే ప్రశ్న ఉద్భవిస్తోంది. 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య హాట్‌లైన్ చర్చలు జరిగి, 36 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది, ఇది మే 18 వరకు పొడిగించబడింది. ఈ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో, శాంతి కొనసాగించేందుకు రాజకీయ స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉంది.
Also Read: ప్రధాని మోదీతో లోకేష్ ఆప్యాయత.. యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ.. గిఫ్ట్ అదుర్స్!
మే 10 నుంచి మూడు సార్లు DGMO స్థాయిలో జరిగిన చర్చల్లో, ఇరు దేశాలు సరిహద్దుల్లో ఒక్క షాట్ కూడా కాల్చకూడదని, దూకుడు చర్యలకు పాల్పడకూడదని అంగీకరించాయి. భారత DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘై, పాకిస్థాన్ DGMO మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా మధ్య ఈ చర్చలు జరిగాయి. సైనిక స్థాయిలో ఉద్రిక్తతలను తగ్గించడం, సరిహద్దుల్లో సైనిక సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ, శాశ్వత శాంతికి మరిన్ని చర్చలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శాంతి మార్గంలో కీలకం
కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు సైనిక స్థాయిలో జరిగిన చర్చలు, ఇకపై రాజకీయ స్థాయిలోకి మారే అవకాశం ఉంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మధ్య చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. సరిహద్దు శాంతి, ఉగ్రవాద నిరోధక చర్యలు, ఇరు దేశాల మధ్య విశ్వాస నిర్మాణం (DGMO) వంటి అంశాలపై ఈ చర్చలు కేంద్రీకతమవుతాయి. అయితే, భారత్ స్పష్టంగా పేర్కొన్నట్లు, పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం ఆగకపోతే ఈ చర్చలు పరిమిత ఫలితాలను మాత్రమే ఇస్తాయి.
అంతర్జాతీయ ఒత్తిడి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కాల్పుల విరమణలో తన పాత్ర ఉందని, వాణిజ్య ఒప్పందాలతో శాంతిని సాధించామని పేర్కొన్నారు. అయితే, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వాదనను తోసిపుచ్చారు, వాణిజ్యం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా యుఎస్, యూకే, రష్యా వంటి దేశాలు ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒత్తిడి తెచ్చినప్పటికీ, భారత్ ఈ ఒప్పందం ద్వైపాక్షిక చర్చల ఫలితమని నొక్కి చెప్పింది.
సవాళ్లు, ఆశాకిరణాలు..
కాశ్మీర్‌లో శాంతి నెలకొనాలంటే, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoKనుంచి అక్రమ ఆక్రమణను ఖాళీ చేయాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో, కాల్పుల విరమణ కొనసాగినప్పటికీ, శాశ్వత శాంతి సవాళ్లతో కూడుకున్నది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మీర్వైజ్ ఫరూఖ్ వంటి నాయకులు శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.