India Military Power: కేజీఎఫ్ -2 సినిమాలో భారీగా డబ్బు తీసుకొని రాఖీ దుబాయ్ లో ఉన్న ఇనాయత్ ఖలీల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కొన్ని తుపాకులను కొనుగోలు చేస్తాడు. ” ఖలాష్ నిఖావ్” అనే పేరు గల ఆ తుపాకులు బుల్లెట్ల వర్షం కురిపిస్తాయి. అధీర మనుషులను నేలమట్టం చేస్తాయి. అదంటే సినిమా కాబట్టి.. లిబర్టీ ఎక్కువగా ఉంటుంది. వాస్తవంలో అలా ఉంటుందా? అది సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది.
కేజీఎఫ్ సినిమాలో మాదిరిగానే ఖలాష్ నిఖావ్ తుపాకులు బుల్లెట్ల వర్షం కురిపిస్తాయట.. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన తుపాకులు భారత సైన్యానికి వచ్చాయి. భారత సైన్యానికి ఐ ఆర్ ఆర్ పి ఎల్ ఏకే -203 తుపాకులు వచ్చాయి. ఈ తుపాకులను అసాల్ట్ రైఫిల్స్ అనే సంస్థ సరఫరా చేస్తోంది. మన దేశంలో తయారైన ఏకే 47, ఏకే 57 కంటే ఇవి అత్యంత శక్తివంతమైనవి. ఈ తుపాకి నాలుగు కిలోల బరువు ఉంటుంది. నిమిషానికి 700 బుల్లెట్లను పేల్చుతుంది. అంతేకాదు ఎనిమిది వందల మీటర్ల రేంజ్ వరకు కూడా ఈ తుపాకి నుంచి బుల్లెట్ దూసుకెళ్తోంది. ఈ తుపాకిని ముద్దుగా షేర్ అని పిలుస్తుంటారు. అయితే మూడు దశాబ్దాలుగా ఇండియన్ మిలిటరీ ఇన్సాస్ తుపాకులను ఉపయోగిస్తోంది. అయితే దానిని కాదని భారత సైన్యం ఇకపై వీటిని ఉపయోగిస్తోంది.
సరిహద్దుల్లో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కదలికలు పెరిగిపోవడం.. ప్రత్యర్థి దేశాల నుంచి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉన్న సంకేతాలు కనిపించడం.. ఇవన్నీ కూడా భారత సైన్యాన్ని ఏకే 203 వినియోగించేలా చేశాయి. ప్రస్తుతం ఈ తుపాకులు భారత సైన్యానికి వచ్చాయి. ఇటీవల అనేక రకాలుగా జరిపిన పరీక్షల్లో ఈ తుపాకులు విజయవంతమయ్యాయని భారత సైన్యం తెలిపింది. అయితే ఈ తుపాకుల కొనుగోలుకు ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అనే విషయం బయటకు తెలియ రాలేదు.
” భారత సైన్యానికి మరో అస్త్రం వచ్చింది. ఇప్పటికే రక్షణ రంగంలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన సైన్యంగా రూపొందించడానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ తుపాకులను భారత సైన్యానికి అందించారు. నిమిషానికి 700 బుల్లెట్లు అంటే మాటలు కాదు. ఒకరకంగా అది నిప్పుతో చెలగాటం మాడినట్టే. భారత్ ఈ స్థాయిలో ఆయుధాలను సమకూర్చుకోవడం గొప్ప విషయం. ఇకపై సరిహద్దుల్లో ఎవరైనా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే వారికి మూడినట్టే. ఈ ఆయుధాలు అగ్గి బరాటాల మాదిరిగా పనిచేస్తాయి. అంతేకాదు ముష్కరులను నేలమట్టం చేస్తాయని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.