ఏప్రిల్‌ 15న లాక్ డౌన్ ఎత్తివేత..

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై లాక్ డౌన్ చేపట్టింది. 21రోజులపాటు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్డౌన్ కాలం పెరుగుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే వీటన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ సీఎం పేమా ఖండూ చేసిన ట్వీట్ తో లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చింది. దేశంలో కరోనా నివారణపై […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 6:58 pm
Follow us on

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై లాక్ డౌన్ చేపట్టింది. 21రోజులపాటు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్డౌన్ కాలం పెరుగుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే వీటన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ సీఎం పేమా ఖండూ చేసిన ట్వీట్ తో లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చింది.

దేశంలో కరోనా నివారణపై గురువారం ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనాపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశం అనంతరం అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్‌ 15న లాక్ డౌన్ ఎత్తివేయనున్నట్లు ఆయన తన ట్వీటర్లో పోస్టు చేశారు. అయితే ప్రజలు బయటికి రావడానికి కొన్ని షరతులతో కూడిన అనుమతులుంటాయని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రజలు సామాజిక దూరంతో మాత్రమే నివారించగలమని ఆయన పేర్కొంది. దీంతో లాక్డౌన్ మరిన్ని రోజులు కొనసాగుతుందనే ప్రచారానికి సీఎం ట్వీట్‌తో తెరపడినట్లయింది.
Also Read: 15 నుండి రైల్వే, విమాన బుకింగ్ లకు సంకేతాలు