India Hits Out Pakistan: ప్రపంచంలోనే ఏకాకి అయిన పాకిస్తాన్.

‘‘మన పాత విఠలా చర్య సినిమాల్లో మాంత్రికుడు ఎప్పుడూ ఏదో ఒక కుట్రపన్నడం.. హీరో అష్టకష్టాలు పడి జయించడం చూసాం. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కు అతికినట్టుగా సరిపోతుంది’’. ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. భారత్, పాకిస్తాన్ లకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది మొదలైంది. పాకిస్తాన్ కుట్రలకు ఆలవాలంగా మారింది. భారత్ ను అస్తిరపరిచేందుకు పాకిస్తాన్ చేయని కుట్ర లేదు. భారత్ లోని సంస్థానాలను, బంగ్లాదేశ్ ను చేజిక్కించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ప్రత్యక్షయుద్ధంలో […]

Written By: NARESH, Updated On : September 17, 2021 1:52 pm
Follow us on

‘‘మన పాత విఠలా చర్య సినిమాల్లో మాంత్రికుడు ఎప్పుడూ ఏదో ఒక కుట్రపన్నడం.. హీరో అష్టకష్టాలు పడి జయించడం చూసాం. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కు అతికినట్టుగా సరిపోతుంది’’. ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. భారత్, పాకిస్తాన్ లకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది మొదలైంది. పాకిస్తాన్ కుట్రలకు ఆలవాలంగా మారింది. భారత్ ను అస్తిరపరిచేందుకు పాకిస్తాన్ చేయని కుట్ర లేదు. భారత్ లోని సంస్థానాలను, బంగ్లాదేశ్ ను చేజిక్కించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ప్రత్యక్షయుద్ధంలో గెలవలేని పాకిస్తాన్ ఇప్పుడు పరోక్షంగా ఉగ్రవాదానికి నిలయమై భారత్ సహా ప్రపంచదేశాలకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశంగా మిగిలిపోయింది.

భారత్, పాకిస్తాన్ విడిపోయిన కొత్తలో తమకు స్థావరంగా ఉపయోగపడుతుందని పాకిస్తాన్ ను చేరదీసి బ్రిటన్, అమెరికా పెద్ద సాయం చేశాయి. కానీ అదే పాకిస్తాన్ ఆ సాయాన్ని ఉగ్రవాదానికి ఉపయోగించి ఇప్పుడు ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించింది. ఆ విషయం తెలిసి ఇప్పుడు అమెరికా, బ్రిటన్ లు పాకిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది.

పాకిస్తాన్ ప్రస్తుతం ఉగ్రవాదం ఎగదోసే రాజ్యంగా ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోతోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో అది మరింత తీవ్రమైంది. అసలు పాకిస్తాన్ పుట్టుకే పెద్ద కుట్రతో మొదలైంది. అది బ్రిటీష్ ప్రభుత్వం చేసిన కుట్ర. వారికి సురక్షిత స్థావరం కోసం ఆరోజు ఒక స్ట్రాటజీతో పాకిస్తాన్ ను విభజించారు. ఇందుకోసం ముస్లింలీగ్ ను ప్రోత్సహించి హిందూ -ముస్లిం ఆజ్యం పోసి పాకిస్తాన్ ను ఏర్పాటు చేశారు.

ఆ రోజు నుంచి కూడా పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే చేస్తూనే ఎదిగింది. భారత్ ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మనదేశంపై చాలా దాడులు చేసింది. ఇప్పుడు అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారింది.

మనం పాకిస్తాన్ గురించి మొదట్లో ఎంత గొంతుచించుకున్నా అమెరికా, బ్రిటన్ వినిపించుకోలేదు. కానీ ఎప్పుడైతే అమెరికాపై దాడి చేసిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోని ఆర్మీ కేంద్రమైన ‘అబోటాబాద్’లో చంపబడ్డాడో అప్పుడే పాకిస్తాన్ నిజస్వరూపం అందరికీ అర్థమైంది. ఓవైపు అగ్రరాజ్యాల సాయం తీసుకుంటేనే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోందన్న విషయం బయటపడింది. అప్పటి నుంచే పాకిస్తాన్ ను ప్రపంచం వెలివేయడం ప్రారంభించింది.  ప్రపంచంలోనే ఏకాకిగా అయిన పాకిస్తాన్ కుట్రలపై ‘రామ్ టాక్’ స్పెషల్ ఫోకస్ వీడియో..