Notam Issued By India: దక్షిణాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. భారత్ చేపడుతున్న భారీ సైనిక విన్యాసాలు, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ 2.0 సంకేతాలు పాకిస్తాన్‌ను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ మొదటి దశ హోల్డ్‌లో ఉంది. రెండో దశ ప్రారంభించేలా భారత ఆయుధ పరీక్షలు, సైనిక విన్యాసాలు ఉన్నాయి. దీంతో దాయాది గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
నేవీ కొత్త వ్యూహాత్మక కదలికలు..
ఆపరేషన్ సిందూర్‌లో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కీలకపాత్ర పోషించారు. ఆసరేషన్ సిందూర్ 2.0లో ఇప్పుడు నేవీ కీలకపాత్ర పోషించనుంది. భారత నావికాదళం కార్వార్ సదరన్ నావల్ కమాండ్ పరిధిలో బలమైన విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. గుజరాత్ తీరం దగ్గర కొనసాగబోయే ఈ చర్యల్లో సౌరాష్ట్ర తీరప్రాంతం ప్రధానంగా ఉంటుంది. పాకిస్తాన్ సముద్రతీర విస్తీర్ణం పరిమితంగా ఉండటంతో (కరాచీ, పస్ని, గ్వాదర్ మాత్రమే ప్రధాన పోర్టులు), నావికాదళం చైతన్యవంతం కావడం ఆ దేశానికి కొత్త ఆందోళనగా మారింది.
వరుస నోట్యామ్‌తో టెన్షన్..
భారత ప్రభుత్వం ఇటీవల రెండుసార్లు నోట్యామ్‌లు (నోటీస్ టూ ఎయిర్ మెన్) జారీ చేసింది. వీటి ప్రకారం అక్టోబర్ 24–27, అక్టోబర్ 25–27 మధ్య నిర్దిష్ట వాయు సముదాయాలు విమాన ప్రయాణాలకు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఇవి ఆయుధ పరీక్షల సమయానికి భద్రతా హెచ్చరికల రూపంలో జారీ చేయబడ్డాయి. పాకిస్తాన్‌ను ఎక్కువగా కలవరపెడుతున్నది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు ఉండే మూడో నోట్యామ్. ఇది గుజరాత్ సౌరాష్ట్ర తీరం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంగా అమల్లో ఉంటుంది. ఎత్తులో 28 వేల అడుగుల వరకు ప్రభావం చెల్లుబాటు అవుతుంది.
త్రివిధ దళాల సమన్వయంతో..
ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సమన్వయంతో అన్‌ఫీబియస్ ఎక్సర్‌సైజ్ అమలు చేయబడుతోంది. రాజస్థాన్ నుంచి సౌరాష్ట్ర తీరానికి మధ్య నోట్యామ్ పరిధి విస్తరించి ఉండటం భౌగోళిక పరంగా అత్యంత వ్యూహాత్మకంగా మారిస్తోంది. సర్‌క్రిక్ ప్రాంతం ఈ విన్యాసాల ప్రధాన కేంద్రంగా గుర్తించబడింది. పాకిస్తాన్ గతంలో ఇక్కడి నుంచే 2008 ముంబై దాడులకు అనుబంధ ప్రయత్నాలు చేసినందున, ఈ ప్రాంతంలో భారత్ దష్టి పెంచింది. రక్షణ మంత్రి ఇప్పటికే పాకిస్తాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు.
అంతర్జాతీయ నిఘా సంస్థల దృష్టి..
భారత నోట్యామ్ ప్రాంతాలపై అమెరికా, చైనా గూఢచార సంస్థలు కూడా నిఘా కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి భారత్ ఏ పరీక్ష వాయిదా వేయకపోవడం గమనార్హం. త్రివిధ దళాల సమన్వయంతో జరుగుతున్న ఈ ఆపరేషన్ దేశ భద్రతా సామర్థ్యాన్ని కొత్తస్థాయికి తీసుకురానుంది.
అంతర్గత పరిస్థితుల ఒత్తిడిలో పాకిస్తాన్
ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, అంతర్గత రాజకీయ ఉద్రిక్తతలతో కుంగిపోతున్న పాకిస్తాన్‌కి ఈ భారత సైనిక కదలికలు కొత్త ఒత్తిడిని తెచ్చాయి. గ్వాదర్ వంటి పోర్టుల రక్షణపైనా ఆందోళన పెరిగింది. సర్‌క్రిక్ ప్రాంతంలో భారత విన్యాసాలు ఆక్రమణాత్మక చర్యలుగా మారితే, పాకిస్తాన్ సైనికంగా ప్రతిస్పందించాలన్న ఒత్తిడి పెరుగుతోంది.
ఆపరేషన్ సిందూర్ 2.0 అనేది కేవలం విన్యాసం కాదు, ఇది భారత్ సరిహద్దు రక్షణ వ్యూహాల్లో కొత్త దశగా భావించబడుతోంది. సముద్రతీరం నుంచీ భూమి వరకు త్రివిధ దళాల చైతన్యం భారత రక్షణ సామర్థ్యాన్ని బలపరుస్తుండగా, పాకిస్తాన్ అంతరంగంలో భయం, అనిశ్చితి పెరుగుతోంది.