India First-Ever Private Train: దేశంలో నూతన శకం ఆరంభమైంది. కేంద్ర ప్రభుత్వం ముందే ప్రకటించిన విధంగా ప్రైవేటు రైలును ప్రారంభించింది. దీనికి కోయంబత్తూరు వేదిక అయింది. అత్యాధునిక హంగులతో 20 బోగీలతో 1100 మంది ప్రయాణికులు ప్రయాణించేలా రైలును తయారు చేశారు. దేశ్ గౌరవ్ పథకం కింద దేఖో అప్నా దేశ్ అనే పేరుతో ప్రైవేటు రైలును ప్రారంభించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.. అనుకున్న విధంగానే దేశంలో ప్రైవేటీకరణకు బీజం వేసింది. దీంతో ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కేంద్రం ప్రకటించిందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు పట్టాలెక్కడంతో అందరిలో ఆశ్చర్యం కలిగింది.
మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నుంచి ఈ రైలు బయలుదేరింది. కోయంబత్తూరు నుంచి షిర్టీకి వెళ్తుతుంది. తిరిగి అక్కడి నుంచి కోయంబత్తూరు వస్తుంది. దీంతో ప్రయాణికులకు సౌకర్యార్థం ఆధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. భద్రతా సిబ్బందితో పాటు వైద్యులు, అన్ని రకాల వారు అందుబాటులో ఉండనున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ రైలు పట్టాలెక్కింది. దీంతో దేశంలో మరిన్ని రంగాలు ప్రైవేటు పరం కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan Bus Yatra: పవన్ కళ్యాణ్ సడెన్ గా బస్సు యాత్రకు అసలు కారణం ఏంటి?
మొత్తానికి తొలి ప్రైవేటు రైలును నడిపించిన ఘనత దక్షిణ రైల్వే దక్కించుకుంది. ఈ మేరకు మేనేజర్ మంగళవారం జెండా ఊపి రైలును ప్రారంభించారు. దీంతో రైలు వారానికి కనీసం మూడు ట్రిప్పులు నడపనున్నట్లు తెలుస్తోది. రెండేళ్ల కాలపరిమితి కింద ఈ రైలును లీజుకు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి కేంద్రం అనుకున్న విధంగా ప్రణాళికలు రచించి అన్ని రంగాలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో అన్ని శాఖలు ప్రైవేటు పరం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ ధ్యేయంగా చెబుతోంది.
షిర్డీ వరకు వెళ్తున్న రైలులో షిర్డీ సాయినాథుడి ఉచిత దర్శనానికి బస్సు సదుపాయం కూడా కల్పించారు. ఈ రైలులో ప్రయాణించిన వారికి ఈ అవకాశం ఉంటుంది. దీనికి గాను అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు రైలు నడపడంతో టికెట్ల ధరలు మామూలుగానే ఉంటాయని ఎక్కువ ధరలు మాత్రం ఉండవని తెలుస్తోంది. దీంతో ప్రైవేటు రైలు కాంక్ష తీరడంతో కేంద్రం ఇంకా కొన్ని రైళ్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. రైల్వే వ్యవస్థ ప్రైవేటు పరం కానుందనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read:KCR alcohol habit : కేసీఆర్ కు మద్యం ఇలా అలవాటైందట.! వైరల్ వీడియో