భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెల్సిందే. జూన్ 15న గాల్వాన్లో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 21మంది వీరమరణం పొందారు. చైనా దొంగదెబ్బను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టడంతో చైనాకు చెందిన 43మంది సైనికులు హతమైనట్లు సమాచారం. ఈ ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు చాలావరకు దెబ్బతిన్నాయి. ఓవైపు శాంతి చర్చలంటూ భారత జవాన్లపై చైనా దొంగ దెబ్బతీయడాన్ని కేంద్రం కూడా సీరియస్ గా తీసుకుంది. దీంతో చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది.
ఇళ్ల స్థలాల పంపిణీకి వాయిదాకు కారణం ఇదేనా..!
చైనాను ఒక్క రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా, దౌత్యపరంగా భారత్ దెబ్బతీస్తోంది. ఇందులో భాగంగానే చైనా, చైనాతో భాగస్వామ్యం ఉన్న కంపెనీలకు చెందిన పలు కాంట్రాక్టులను భారత్ రద్దు చేసింది. హైవే, రైల్వే, టెలికాం రంగాల్లో ఇప్పటికే చైనాకు చెందిన కంపెనీల కాంట్రాక్టులను కేంద్రం రద్దు చేయడంతో ఆ దేశానికి వేల కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాకుండా చైనాకు చెందిన 59 యాప్స్ ను కేంద్రం ప్రభుత్వం నిషేధించింది. ఇందులో భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన టిక్ టాక్ కూడా ఉంది. టిక్ టాక్ నిషేధంతో ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా భారతదేశం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీ సుంకం విధించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ లిస్టు రెడీ అయినట్లు సమాచారం. నాణ్యత ప్రమాణాల పేరుతో చైనాకు చెందిన వస్తువులను భారత్ నిషేధించే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో చైనాకు సంబంధించిన వస్తువులను ఇకపై ఉపయోగించకూడదనే ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే చైనా లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ కు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు బహిరంగగానే మద్దతు ప్రకటిస్తున్నారు.
తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?
కరోనాతో ఇప్పటికే చైనాకు చెడ్డపేరు వచ్చింది. మరోవైపు సరిహద్దు దురాక్రణలతో ప్రపంచం దృష్టిలో చైనా మార్కెట్ పడిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో భారత ప్రధాని మోదీ లఢక్ లో పర్యటించి చైనా షాకిచ్చారు. భారత ఆర్మీ అధికారులతో తాజా పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా చైనా ఘర్షణలో గాయపడిన సైనికులను పరామర్శించారు. సరిహద్దుల్లో ప్రధాని సైనికులను ఉద్దేశించి ప్రసంగించి వారిలో ఆత్మస్థైర్యం నింపారు. చైనాకు అంతర్జాతీయ ఒత్తిడులు, మార్కెట్లో చైనా విలువ రోజురోజుకు పడిపోతుండటం, ఆర్థిక నష్టం కలుగుతుండటంతో చైనా సరిహద్దుల్లో తన సైన్యాన్ని వెనక్కి తరలించినట్లు తెలుస్తోంది.
తాజాగా చైనా సైనికులు తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ నుంచి కనీసం ఒక కిలోమీటర్ దూరం వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతం నుండి గుడారాలను తొలగించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి జరిగిన చర్చల ఫలితంగా గాల్వన్, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ నుంచి సైనికులను వెనక్కి పంపాలని ఇటీవలే ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా దశల వారీగా ఇరుదేశాలు తమ సైన్యాన్ని వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది.
తొలిదశలో చైనా బలగాలు గాల్వాన్ నుంచి కిలోమీటర్ వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. చైనా సైన్యం నిజంగానే వెనక్కి విషయాన్ని నిర్ధారించుకున్నాకే రెండోదశలో భారత్ బలగాలు వెనక్కి మరలే అవకాశం ఉంది. దీంతో గత ఏడువారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే చైనా మళ్లీ నక్కజిత్తుల ప్లాన్ వేస్తే మాత్రం భారత్ బలగాలు బుద్దిచెప్పడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: India china troops start stepping back at galwan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com