https://oktelugu.com/

సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్… భారత్ చైనా సైనికుల మధ్య గొడవ.. పలువురికి గాయలు

సరిహద్దుల్లో చైనా కయ్యానికి దువ్వుతోంది. బలగాలను మోహరిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా డ్రాగెన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరో వైపు ఆక్రమణలకు పాల్పడుతూ.. తన బుద్ధిని ప్రదర్శిస్తోంది. ఈ మేరకు.. తూర్పు లద్దాఖ్ వివాదంతో భారత్.. చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరో వైపు వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 25, 2021 / 02:12 PM IST
    Follow us on


    సరిహద్దుల్లో చైనా కయ్యానికి దువ్వుతోంది. బలగాలను మోహరిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా డ్రాగెన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరో వైపు ఆక్రమణలకు పాల్పడుతూ.. తన బుద్ధిని ప్రదర్శిస్తోంది. ఈ మేరకు.. తూర్పు లద్దాఖ్ వివాదంతో భారత్.. చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరో వైపు వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్ చైనా సైనికులు ఘర్షణకు దిగారు.. పలువురికి గాయాలు అయ్యాయి.

    Also Read: రాముడికి ఉడతా భక్తి.. మందిరం నిర్మాణానికి పారిశ్రామికవేత్తల భారీ విరాళాలు

    నకులా వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ప్రయత్నించాయి. వీరిని భారత బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని సమాచారం. గతవారం చోటు చేసుకున్న ఘటన తాజాగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పీఎల్ఏ సైనికులను భారత బలగాలు వెనక్కి పంపాయి. ఈ ఘర్షణలో పలువురు సైనికులకు గాయాలు అయినట్టు తెలిసింది.

    Also Read: నాసిక్ టు ముంబయి.. సాగు చట్టాలపై కదం తొక్కిన మహారాష్ర్ట రైతులు

    కాగా ఈ ఘటనపై భారత సైన్యం అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. జనవరి 20న నకులా ప్రాంతంలో భారత్ చైనా జవాన్ల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుందని తెలిపారు. అయితే స్థానిక కమాండెంట్ల జోక్యంతో వివాదం సద్దుమణిగిందని తెలిపారు. దీనికి సంబంధించిన అవాస్తవ కథనాలకు దూరంగా ఉండాలని మీడియాను కోరారు. కాగా తూరుపు లద్దాఖ్ ప్రతిష్టంభనపై రెండు దేశాల మధ్య తొమ్మిదో విడత చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటు చేసుకోవడం గమనార్హం. లద్దాఖ్ అంశంపై ఆదివారం భారత్ చైనా సైన్యం ఉన్నతాధికారులు సమావేశం అయిన విషయం తెలిసిందే..

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఆదివారం ఉదయం పది గంటలకు మొదలైన చర్చలు సోమవారం వేకువజామున వరకు కొనసాగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గింపు.. బలగాల ఉప సంహరణపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం. బలగాల తగ్గింపు తొలి బాధ్యత చైనాదేనని భారత సైం మరోసారి స్పష్టం చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఓ వైపు చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు లద్దాఖ్ లో చైనా కవ్వింపు చర్యలకు పూనుకోవడంతో భారత్ దీనిపై ధీటుగా స్పందిస్తోంది.