https://oktelugu.com/

నిరుద్యోగులకు యూపీఎస్సీ శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూపీఎస్సీ నుంచి 249 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 11వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read: తెలంగాణ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 25, 2021 / 01:55 PM IST
    Follow us on

    యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూపీఎస్సీ నుంచి 249 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 11వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..?

    ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా ‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డాటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. మొత్తం ఉద్యోగాలలో డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌ 116, స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ ఉద్యోగాలు 45, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూట‌ర్ 80 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    Also Read: ఐఎండీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే..?

    జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ 6 ఉద్యోగ ఖాళీలు, లెక్చ‌ర‌ర్‌ 1, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఒక ఖాళీ ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం అధారంగా వేతనం లభిస్తుంది.