Centre bans 20 YouTube channels: పాకిస్తాన్ కేంద్రంగా మనదేశంలోని సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారం ప్రచారం చేసే సమాచార వ్యవస్థను భారత్ భగ్నం చేసింది. అక్కడి మీడియాపై ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ కేంద్రంగా పలు విషయాలపై నకిలీ వార్తలను ప్రసారం చేసేందుకు యూట్యూబ్, ఇంటర్నెట్ ను వాడుకుంటూ అసత్య ప్రచారం చేసేందుకు సిద్ధపడింది. ఈ కుట్రలను భారత్ పసిగట్టి తుడిచిపెట్టింది. వాటిపై నిషేధం విధించి వాటి ప్రస్థానాన్ని ప్రశ్నించింది. దీంతో పాక్ అటు మింగలేక ఇటు కక్కలేక అన్నట్లు సందిగ్ధంలో పడిపోయింది.

యూట్యూబ్ చానళ్లు దేశంలోని సున్నితమైన అంశాలపై అక్కడి మీడియాలో కథనాలు ప్రసారం చేసేందుకు సంకల్పించాయి. దీన్ని సమాచార మంత్రిత్వ శాఖ గమనించి వాటి పన్నాగాన్ని బయటపెట్టింది. ఇందులో భాగంగా వాటిని నిర్వీర్యం చేసే పనిలో పడింది. పాకిస్తాన్ డిజిటల్ కుట్రలను బయటకు తీసింది. పాకిస్తాన్ మద్దతుతో నిర్వహిస్తున్న 20 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్ సైట్లను బ్లాక్ చేయాలని ఆదేశించింది.
భారత్ లోని పలు అంశాలపై నకిలీ వార్తలు వ్యాప్తి చేసేందుకు కాశ్మీర్, ఇండియన్ ఆర్మీ, రామమందిర నిర్మాణం, బిపిన్ రావత్ వంటి వాటిపై తప్పుడు కథనాలు ప్రసారం చేసేందుకు సిద్ధపడటంతో వాటిని పసిగట్టి భగ్నం చేసి వాటిని నిషేధించింది. దీనికి ఎన్ పీజీ అనే నెట్ వర్క్ ను ఉపయోగించుకునేందుకు సిద్ధపడింది. దీంతో భారత్ వాటిని గమనించి వాటిని తిప్పికొట్టింది.
Also Read: S 400 missile: భారత్ అష్టదిగ్భంధనం: చైనా, పాక్ వెన్నులో వణుకు
ఈ చానళ్లకు 35 లక్షల కంటే ఎక్కువ మంది సబ్ స్కైబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసత్య వార్తలను ప్రసారం చేసి దేశ సమగ్రతకు భంగం కలిగించే పనిలో అక్కడి మీడియా పడటం ఆందోళన కలిగించేదే. 2021లోని రూల్ 16 ప్రకారం అత్యవసర అధికారాలను వినియోగించి భారత మంత్రిత్వ శాఖ తప్పుడు సమాచారం పోస్టు చేయడంతో కంటెంట్ నిరోధించే నిబంధనల ప్రకారం చానళ్లపై చర్యలు తీసుకుంది. దీంతో పాక్ పన్నాగం మరోసారి బట్టబయలు అయినా దానికి బుద్ధి మాత్రం రావడం లేదు.
Also Read: Omicron Effect: ఒమిక్రాన్ ఎఫెక్ట్ : దేశంలో ఆంక్షలు మొదలయ్యాయి..