అంతర్జాతీయంచైనాపై భారత్‌ విజయం

చైనాపై భారత్‌ విజయం

india win on chinaఒకప్పటి భారత్‌ వేరు.. నేటి భారత్‌ వేరు.. ఇప్పుడు ఏ దేశంతోనైనా సై అంటే సై అనాల్సిందే. ఇప్పటికే సరిహద్దుల్లో పనికిరాని పన్నాగాలు పన్ని దెబ్బతిన్న చైనాకు మరో పరాజయం ఎదురైంది. సరిహద్దుల్లో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న చైనాపై భారత్‌ ఓ చిన్న విజయం సాధించింది. అది యుద్ధంలో కాదు.. ఐక్యరాజ్య సమితి ఎన్నికల్లోనే.

Also Read: న్యాయవ్యవస్థలోనూ అమరావతి భూకుంభకోణం లింకులు?

లైంగిక సమానత్వం, మహిళా సాధికారత లక్ష్యంగా పని చేసే మహిళల స్థాయికి సంబంధించిన ఐరాస కమిషన్‌లో భారత్‌ సభ్యురాలిగా ఎన్నికైంది. ఐక్యరాజ్య సమితిలో ప్రతిష్ఠాత్మక కమిషనర్‌‌ ఆన్‌ ద స్టేటస్‌ ఆఫ్‌ విమెన్‌ (సీఎస్‌డబ్ల్యూ)లో 54 మంది సభ్యులుంటారు. ఆసియా పసిఫిక్‌ కేటగిరీకి సంబంధించి రెండు ఖాళీలు ఏర్పడగా.. వాటికి సోమవారం ఎన్నికలు జరిగాయి.

ఈ స్థానాల కోసం భారత్‌, చైనా, అఫ్ఘానిస్థాన్‌ పోటీ పడ్డాయి. ఇందులో అఫ్ఘానిస్థాన్‌ 39, భారత్‌ 38 ఓట్లు సాధించాయి. ఐరాసలో శాశ్వత సభ్యత్వ దేశమైన చైనాకు కేవలం 27 ఓట్లు మాత్రమే వచ్చారు. కనీసం సగం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. దీంతో చైనా మీద భారత్‌ గెలుపు సాధించింది.

Also Read: ఆశ్చర్యం.. మన ఎంపీలు జీతాల్లో కోత?

ఇదిలా ఉండగా.. భారత్‌, అఫ్ఘాన్‌ సభ్యులు నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.సీఎస్‌డబ్ల్యూ సభ్యదేశంగా భారత్‌ ఎన్నికైందని, లైంగిక సమానత్వం, మహిళా సాధికారత దిశగా చేసే కృషికి ఇది తిరుగులేని గుర్తింపని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే, ఐరాస ఎకనామిక్‌ మరియు సోషల్‌ కౌన్సిల్‌లో భాగమైన కమిషన్‌ ఆన్‌ పాపులేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌(సీపీడీ), కమిటీ ఫర్‌ ప్రోగ్రామ్‌ అండ్‌ కో ఆర్డినేషన్‌ (సీపీసీ)లోనూ భారత్‌ ఒక్కో సీటు సాధించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

De-dollarization : అమెరికా డాలర్‌ నుంచి మరో దేశం ఔట్‌.. చైనాతో చేతులు కలిపిన లిబియా!

De-dollarization : ప్రపంచంలో ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్న కరెన్సీ డాలర్‌. బలమైన డాలర్‌ స్థిరత్వమే ప్రపంచ వ్యాప్తంగా డాలర్‌ ఆధిపత్యానికి కారణం. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు, చైనా ఆర్థికాభివృద్ధి తదితర కారణాలతో...

Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా?

Indus Waters Treaty : సరిహద్దులపై తుపాకులు మోగినప్పుడల్లా ప్రపంచం దృష్టి యుద్ధంపైనే ఉంటుంది. కానీ భారత్–పాకిస్తాన్ మధ్య అసలు పోరు కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు. నీటి బొట్టు కోసం...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...

Maho Beach: విమానం టేకాఫ్.. భయంకరమైన గాలులు.. పర్యాటకులు ఎగిరిపడ్డారు.. వైరల్ వీడియో

Maho Beach: వాతావరణం ఆహ్లాదంగా ఉంది.. మబ్బులు కమ్ముకున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. పర్యాటకులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు. నచ్చిన ఫుడ్ తింటు ఎంజాయ్ చేస్తున్నారు....

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...
Oktelugu Epaper
Exit mobile version