Increased Employment Guarantee Wage Rates : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెస్తూ అమలులోకి తీసుకొచ్చింది. దీంతో కూలీలకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన పథకం రానురాను రాజుగారి గుర్రం గాడిదైందన్నట్లుగా పథకం నీరుగారిపోతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పథకం అమలుకు నిధులు కేటాయించినా వాటిని సైతం పక్కదారి పట్టిస్తూ కూలీల కడుపు కొడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల రేట్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లు ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. రోజుకు రూ. 257 లుగా చెల్లించేందుకు కేంద్రం అంగీకారం చెప్పడం విశేషం. దీంతో వేసవిలో ఉపాధి కూలీలకు మేలు జరగనుంది. ఇన్నాళ్లు అరకొర చెల్లింపులతో అసలు వస్తాయో రావో అనే అనుమానాలు అందరిలో నెలకొంటున్నాయి.
Also Read: NTR Koratala Siva Movie: ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే
కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రూ. 3,803 కోట్లతో 29 లక్షల కుటుంబాలకు 48 లక్షల మందికి కూలీ పనులు కల్పించారు. దీంతో ఈ సంవత్సరంలో రాష్ట్రంలో 14 లక్షల కోట్ల 67 లక్షల పనిదినాలు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను 14 కోట్ల 9 లక్షల పనిదినాలు కల్పించారు. ఈ పథకం కింద నైపుణ్యం లేని కూలీల కోసం ఉద్దేశించింది కావడంతో వారికి ఏడాదిలో కనీసం పని దినాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇందులో చిన్ననీటి వనరుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. చెక్ డ్యాముల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత, మొక్కల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు పని కల్పించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. కూలీలకు సమగ్రంగా పనులు కల్పించేందుకు ఉద్దేశించిన పనులు ఖరారు చేసేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు. గ్రామసభల్లో ఎంపిక చేసిన పనులకు ఆమోదం తెలిపి వాటిని పూర్తి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో కూలీలకు ముమ్మరంగా పనులు కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
Also Read: AP New Disticts: ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఇవే.. 4వ తేదీ నుంచే అమలు.. ఫుల్ డీటైల్స్