
దేశమంతా నష్టాల్లో పయస్తుంటే ఆదానీ మాత్రం వ్యాపారంలో దూసుకుపోతున్నారు. రూ.వేల కోట్ల ఆస్తులు సమకూరుస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. దీంతో అందరి దృష్టి ఆదానీ మీదే పడింది. వ్యాపారంలో ఎలా రాణిస్తున్నారననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మోదీ సూచించిన సలహాల మేరకే వ్యాపారం చేయడంతో ఆయన వేగంగా దూసుకుపోతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
గౌతం ఆదానీ సంపద వేగంగా పె రుగుతోంది. గంటకు రూ.75 కో ట్లు. ఆయన నేతృత్వంలోన ఆదానీ గ్రూపునకు చెందన ఆరు లిస్టెడ్ కంపె నీల్లో గతేడాది ఇదే సమయానికి రూ.10 వేల పె ట్టుబడి పెడితే అది ఇప్పుడు రూ.52 వేల విలువ అయింది. ఒక్క ఏడాదిలో సంపద ఆయనను అంబానీ అంతటి వాన్ని చేసింది. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాలైన టాటా, బిర్లా, అంబానీ వంటి వారితో పోటీ పడుతోంది.
ఆదానీ సంపద పె రగడానికి కారణం ఆయన గ్రూపులోని లిస్టెడ్ కంపెనీలు ఇన్ ఫ్ఱాపైనే ఎ క్కువ పె ట్టుబడి పె ట్టారు. రెండేళ్ల నుంచి పె ట్టుబడులు వేగంగా పెరిగాయి. మొత్తం పెట్టిన రూ.52 వేల కోట్లలో కేవలం గతేడాదిలోనే రూ.25 వేల కోట్లు పెట్టుబడులు కింద పె ట్టారు. ఆదానీ గ్రూప్ వరుసగా గ్యాస్ పంపిణీ, పవర్, ఓడరేవులు, విద్యుత్ పంపిణీ రంగాలపై ఎక్కవ దృష్టి పెట్టింది.
గత ఏడాది ఆదానీ గ్రూపు మార్కెట్ విలువ రూ.1.64 లక్షల కోట్లు. ఈ ఏడాది అదే సమయానికి 420 శాతం పె రిగి రూ.8.5 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలో ముఖేష్ అంబానీ సంపద 77 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021 సంవత్సర ప్రారంభం నుంచి ఆదానీ సంపద గంటకు రూ.75 కోట్లు చొప్పున పెరుగుతోంది. ఈ స్థాయిలో సంపాదిస్తున్న వారిలో ప్రపంచంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెప్బెజోన్, ఫ్రెంచి లగ్జరీ టైకూన్ బెర్నార్డ్ అర్నల్డ్ ఉన్నారు.
ప్రస్తుతం అంబానీ, ఆదానీ సంపదల మద్య దాదాపు 8 మిలియన్ డాలర్లు ఉంది. గత ఏడాది ఆదానీ సంపద విలువ పె రిగిన వేగం చూస్తుంటే ఆయన అంబానీని దాటేస్తారని తెలుస్తోంది. గతేడాది జియో ప్లాట్ ఫామ్స్, రిలయన్స్ రిటైల్ డీల్స్ తో అంబానీ ఆస్తుల విలువ బారీగా పెరిగింది. ఆదానీ ఆస్తుల విలువ పెరగడంతో షేర్ మార్కెట్ పాత్ర కూడా ఉంది. ప్రపంచ స్థాయి టె క్ దిగ్గజాలు ఆకర్షనీయమైన రేట్లకు వాటాలను కొనుగోలు చేశాయి.