Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Srivari Income : శ్రీవారి ఆదాయంపై శ్వేత పత్రం: వేంకటేశ్వర స్వామికి ఎన్ని ఆస్తులు...

Tirumala Srivari Income : శ్రీవారి ఆదాయంపై శ్వేత పత్రం: వేంకటేశ్వర స్వామికి ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే?

Tirumala Srivari Income  : నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లే కలియుగ వైకుంఠం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి వద్ద 15,938 కోట్ల రూపాయల నగదు, 10,258 కిలోల బంగారం ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.. శ్రీవారికి భక్తులు సమర్పించిన నగదు, బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు వెల్లడించింది. టిటిడి చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ డబ్బులు ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా ఇవ్వబోదని స్పష్టం చేసింది. అయితే కాల పరిమితి ముగియబోతున్న 5000 కోట్ల డిపాజిట్లను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతుందని నెల్లూరు జిల్లా కావలికి చెందిన భక్తుడు శనివారం జరిగిన డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ధర్మారెడ్డి స్పందిస్తూ టీటీడీపై బురద చల్లేందుకు హిందూ మత దశలు ఈ దుచ్చెరకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడు పెట్టుబడులు పెట్టిన సందర్భాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 15, 938 కోట్లను జాతీయ బ్యాంకులోనే డిపాజిట్ చేసినట్టు తెలిపారు. ఇకపై కూడా అధిక వడ్డీ జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

-శ్రీవారి ఆదాయంపై శ్వేత పత్రం

తిరుమల ఆస్తులపై ఈవో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టకూడదని టీటీడీ బోర్డు ఇప్పటికే తీర్మానించిందని వివరించారు. పసిరి కానుకలను 12 సంవత్సరాల దీర్ఘకాలిక డిపాజిట్ లో గోల్డ్ మానిటైజేషన్ స్కీం ద్వారా కరిగించడం, శుద్ధి చేయడం, పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మింట్ కు పంపిస్తున్నట్లు వివరించారు. గత అక్టోబర్లో శ్రీవారి హుండీ ద్వారా 122.83 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 22.7 4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు..1.08 కోట్ల లడ్డూలను విక్రయించారు. 60. 91 లక్షల మంది అన్న ప్రసాదాలు స్వీకరించారు. 10.25 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక ఈనెల 20 నుంచి 28 వరకు తిరుచానూరు పద్మావతి దేవి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి తిరుపతిలో టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారిని ప్రారంభించారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేలు, మిగతా రోజుల్లో రోజుకు 15000 టోకెన్లు జారీ చేస్తున్నారు.. క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచే యోచనలో అధికారులు ఉన్నారు. నెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 8 గంటల వరకు అమలు చేయనున్నారు. నవంబర్ 7న కర్నూలు జిల్లా యాగంటి, 14వ తేదీన విశాఖపట్నం, 18వ తేదీన తిరుపతిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు డిసెంబరు ఒకటి నుంచి తిరుపతిలోని మాధవంలో ఆఫ్లైన్లో బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. 8న చంద్రగ్రహణం కారణంగా దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయాలు తలుపులు మూసివేసి ఉంచారు. 9వ తేదీన ఒంగోలులో, ఆరో తేదీన పారిస్, 12వ తేదీన లండన్, 13వ తేదీన స్కాట్లాండ్లోని ఎడిన్ బర్గ్ లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30 నాటికి శ్రీవారి వద్ద 10, 258.37 కిలోల బంగారం ఉంది. ఇందులో 9,819.38 కిలోల బంగారం ఎస్ బి ఐ లో డిపాజిట్ చేశారు. 438.99 కిలోల బంగారాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular