Homeఆంధ్రప్రదేశ్‌AP Volunteers: వలంటీర్లకు పంగనామం.. సత్కారాలతో సరిపెట్టేశారు

AP Volunteers: వలంటీర్లకు పంగనామం.. సత్కారాలతో సరిపెట్టేశారు

AP Volunteers: ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు వలంటీర్లు, వారికి ఎంతచేసినా తక్కువే. అందుకే ఏటా ఉగాది నాడు సన్మానిస్తున్నాం. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు అందిస్తున్నాం. ప్రోత్సాహక నిధిని అందిస్తున్నాం’.. ప్రభుత్వ అధినేత నుంచి అమాత్యులు, ఎమ్మెల్యేలు చెప్పిన మాటలివి. అయితే ఇది జరిగి నెల గడుస్తున్నా వలంటీరు ఖాతాల్లో ప్రోత్సాహక నిధి మాత్రం జమకాలేదు. అన్నింటి మాదిరిగానే మానసపుత్రికలైన వలంటీర్ల విషయంలో కూడా ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని చూపించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీరు వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించి పౌరసేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు.

AP Volunteers
AP Volunteers

పంచాయతీకి 10 మంది చొప్పున నియమించారు. అయితే వీరికి ఇస్తున్న వేతనం రూ.5 వేలు కావడంతో.. వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏటా ఉగాది నాడు పురస్కారాలను అందించాలని నిర్ణయించింది. సేవామిత్ర, సేవారత్న, సేవావజ్రాలుగా విభజించింది. సేవామిత్రలకు రూ.10 వేలు, సేవారత్నలకు రూ.20 వేలు, సేవావజ్రాలకు రూ.30 వేలు ప్రోత్సాహక నిధిని ప్రటించింది. ఏప్రిల్‌ 2న ఉగాది నాడు పురస్కారాలను అందించింది. ఘనంగా సన్మానించింది. 48 గంటల్లో ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ కార్యక్రమం జరిగి దాదాపు 40 రోజులు దాటుతున్నా వలంటీర్ల ఖాతాల్లో నగదు జమకాలేదు. వీరందరికీ ఎదురుచూపులు తప్పడం లేదు.

Also Read: Analysis on Narayana Arrest : నారాయణ అరెస్ట్ పై ఎన్నో అనుమానాలు?

ప్రభుత్వ తీరుపై అసంతృప్తి
ప్రభుత్వ తీరుపై వలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమతో అన్ని పనులు చేయించుకున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని తప్పుపడుతున్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా ప్రశ్నిస్తే ఎక్కడ తొలగిస్తారేమోనని భయపడుతున్నారు. ఆర్భాటంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్రాల ఎంపికలో కూడా నేతల సిఫారసులకు పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహక నిధిని ఖాతాల్లో జమ చేయాలని బాధిత వలంటీర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

AP Volunteers
AP Volunteers

విధుల నుంచి తొలగింపు
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మండలానికి వందలాది మంది చొప్పున విధుల నుంచి తొలగిస్తున్నారు. రకరకాల కారణాలు చూపుతూ వారి శ్రీముఖాలు పంపిస్తున్నారు. చాలాచోట్ల అధికార పార్టీలో విభేదాలకు వలంటీర్లు బలవుతున్నారు. తమ మాట వినలేదని కొందరికి, రాజకీయాలు చేస్తున్నారని మరికొందరికి, టీడీపీకి సహకరిస్తున్నారని ఇంకొందరికి, విధులు సక్రమంగా లేదని కొందర్ని విధుల నుంచి తొలగిస్తున్నారు. దీంతో వలంటీర్ల వ్యథ అంతా ఇంతా కాదు. ఎంతో సంతోషంగా వలంటీరు విధులు బాధ్యతగా నిర్వర్తిస్తుంటే ప్రభుత్వ తీరు సరిగ్గాలేదని మానస పుత్రికలైన వలంటీర్లే చెబుతున్నారు.

Also Read:BJP Master Plan In Telangana: కేసీఆర్ తో మైండ్ గేమ్.. తెలంగాణలో బీజేపీ మాస్టర్ ప్లాన్?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version