Journalists: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో ఏపీ సర్కారుతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం చాలా ముందుంది. వీరి సంక్షేమం విషయంలో మాటలు చెప్పడం కంటే కూడా కొద్దిమేర ఆచరణలో చూపిస్తోంది. ముఖ్యంగా కరోనా బారిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తూ అందరి మన్నలను పొందుతోంది. కానీ ఏపీ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కరోనా సమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్లుగా పని చేశారు. కరోనా సమాచారాన్ని ప్రజలు అందించడంలో ప్రాణాలను సైతం జర్నలిస్టులు లెక్క చేయలేదు. ఈక్రమంలోనే పలువురు జర్నలిస్టులు కరోనా బారి అనంతరం కోలుకున్నారు. ఈక్రమంలోనే కొంతమంది జర్నలిస్టులు ప్రాణాలను కోల్పోవడం శోచనీయంగా మారింది.
కరోనాతో మృతిచెందిన బాధిత జర్నలిస్టు కుటుంబానికి తెలంగాణ సర్కారు అండగా నిలుస్తోంది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి రూ.2లక్షలు, ఇతర కారణాలతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబానికి ఒక లక్షా రూపాయాలను ప్రభుత్వం సాయంగా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు.
ఈమేరకు ఈనెల 15వ తేదిన ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి ప్రభుత్వం చెక్కు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీంతోపాటు కరోనా బారిన పడిన జర్నలిస్టులకు తక్షణసాయం కింద రూ.20వేల చొప్పున అందిస్తోంది. అంతకుముందు డెస్క్ జర్నలిస్టులతో సహా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం అందించింది. డబుల్ బెడ్ రూం స్కీమ్ కూడా వర్తింపజేసింది.
Also Read: మళ్లీ మునుపటి స్థితికి టీ కాంగ్రెస్..?
ఏపీలోనూ జర్నలిస్టులు ఇలాంటి సంక్షేమ పథకాలు, సాయాన్ని ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నయాపైసా ఇవ్వడం లేదు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5లక్షలు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఎంతమందికి ఇచ్చారనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.
నిజంగా అలాంటిది జరిగి ఉంటే తెలంగాణ చెంది అక్కడ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న అమర్ లాంటి వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి సీఎం జగన్ ను పొగిడేవారు. అలాంటిదేమీ జరుగలేదంటే జర్నలిస్టులకు ఏ సాయం అందడం లేదని అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా జర్నలిస్టుల సంక్షేమంలో ఏపీ కంటే తెలంగాణే నయం అన్నట్లు పరిస్థితి మారిపోయింది.
Also Read: మిషన్-2023.. బీజేపీలోకి ఉద్యమ నేతలు.. చేరికలతో బీజీబీజీ..!