https://oktelugu.com/

Actress Katrina Kaif: కత్రినా- విక్కీల పెళ్లికి టాలీవుడ్ స్టార్ హీరోకి ఇన్విటేషన్… ఆ హీరో ఎవరంటే ?

Actress Katrina Kaif: స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి ముచ్చట్లే… మరో రెండు రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించిన కత్రినా ఎట్టకేలకు వివాహంతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 01:03 PM IST
    Follow us on

    Actress Katrina Kaif: స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి ముచ్చట్లే… మరో రెండు రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించిన కత్రినా ఎట్టకేలకు వివాహంతో అతడి చెంతకు చేరనుంది. వీరి పెళ్లి అతికొద్ది బంధువులు… ఇంకొంతమంది ప్రముఖల మధ్య ఈ నెలలో జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ లో క్యాట్- విక్కీల పెళ్ళికి అంతా సిద్ధమవుతున్నాయి. ఇక తాజగా ఈ జంట పెళ్లి పత్రికలను పంచే పనిలో పడ్డారంట. చాలా ముఖ్యమైన గెస్టులను మాత్రమే కత్రినా పిలవనున్నదట. ఇక టాలీవుడ్ లో అమ్మడు పిలిచిన అతికొద్ది మందిలో విక్టరీ వెంకటేష్ ఒకరు అని తెలుస్తుంది.

    ఇప్పటికే కత్రినా, వెంకీమామకు ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు సమాచారం. వెంకటేష్ ‘మల్లీశ్వరి’ చిత్రంతోనే కత్రినా టాలీవుడ్ కి పరిచయమయ్యింది. ఈ సినిమా తరువాత కత్రినా తెలుగు అభిమానులను అలరించింది. ఇక ఈ సినిమా సమయం నుంచి వెంకీకి కత్రినాకు మంచి స్నేహం ఉందని, అందులోను తన కెరీర్ ని మార్చిన హీరోగా వెంకటేష్ ని ఆమె అభిమానిస్తుందని అందుకే స్పెషల్ గెస్ట్ గా వెంకటేష్ ను పిలిచినట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త నిజమైతే టాలీవుడ్ నుంచి కత్రినా – విక్కీ పెళ్ళికి ఆహ్వానం అందిన మొదటి హీరోగా వెంకటేశ్ నిలుస్తారు.