Population: చైనాలో జనాభా తగ్గుతున్నది.. మనదేశంలో మాత్రం నానాటికి పెరిగిపోతుంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2050 దాకా ఏటా జనాభా పెరిగే దేశాలు మొత్తం 8. అవి భారత్, పాకిస్తాన్, పిలిఫిన్స్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, టాంజానియా, నైజిరియా. ఈ దేశాల్లో విస్తీర్ణపరంగా భారత్ అతిపెద్ద దేశం.. ఒకవేళ దేశ జనాభా పెరిగినప్పటికీ వారిని సాక గలిగే సామర్థ్యం కొద్దో గొప్పో ఈ దేశానికి ఉంటుంది. కానీ మిగతా దేశాల పరిస్థితి అలా కాదు. ఉదాహరణకు పాకిస్తాన్ దేశాన్ని తీసుకుంటే ప్రస్తుతం ఆ దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. గోధుమపిండి కోసం జనం కొట్టుకు చస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా దేశాలు కూడా పాకిస్తాన్ కంటే గొప్పగా ఏమీ లేవు.

ప్రస్తుతం భారతదేశ పౌరుల సగటు వయసు 28.7 ఏళ్లు కాగా… చైనాలో 38.4 ఏళ్ళుగా గా ఉంది. జపాన్ లో ఇది 48.6 ఏళ్ళుగా ఉంది. అంతర్జాతీయ సగటు 30.3 ఏళ్ళు. అంటే భారతీయుల సగటు వయసు అంతర్జాతీయ సగటుకన్నా తక్కువ.. ఐక్యరాయ్ సమితి పాపులేషన్ ఫండ్ అంచనాల ప్రకారం 2022లో భారత దేశంలో 15 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్న వారి సంఖ్య ఏకంగా 68%, 15 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్నవారు 27% ఉండగా, 65 ఏళ్లు అంతకుమించి ఉన్న వారు మన దేశ జనాభాలో కేవలం 7%. పది నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారి జనాభా 25.3 కోట్లు.. ప్రపంచంలోనే కౌమారప్రాయంలో ఉన్న వారి జనాభా ఎక్కువగా ఉన్న దేశం కూడా భారత దేశమే కావడం విశేషం.. 2030 దాకా యువ జనాభా ఎక్కువగా ఉండే దేశంగా భారత్ కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ అభిప్రాయపడింది.
క్రూడ్ డెత్ రెట్… అంటే దేశ్ జనాభాలో ప్రతి 1,000 మందికి ఒక ఏడాదిలో చనిపోయే వారి సగటు సంఖ్య.. 1950 నాటికి చైనాలో ఈ సంఖ్య 23.2 గా ఉంటే… భారత్లో ఈ సంఖ్య 22.2 గా ఉండేది. భారత్లో విస్తృతమైన ప్రజారోగ్య సదుపాయాలు, మెరుగైన జీవన పరిస్థితుల కారణంగా 1994 నాటికి క్రూడ్ డెత్ రేట్ 9.8 కి చేరింది.. 2020లో 7.4 కు చేరింది.

ఇక భారత దేశ సంపూర్ణ సాఫల్యత రేటు… అంటే ఒక మహిళా సగటున కనే పిల్లల సంఖ్య… 1992_93 లో 3.4 గా ఉండేది.. 2019_21 కు అది రెండుకు తగ్గిపోయింది.. జనాభా అభివృద్ధి చెందాలంటే ఈ రేటు కనీసం 2.1 గా ఉండాలి.. ఈ సంఖ్యను వైద్య పరిభాషలో రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీగా వ్యవహరిస్తారు. అంటే ఒక మహిళ తనకు, తన జీవిత భాగస్వామికి బదులుగా ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది అన్నమాట.. పుట్టిన ప్రతి శిశువుకు జీవించే అవకాశం లేదు కాబట్టి… 2కు బదులుగా 2.1 రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీగా రేటుగా ఎంచుకున్నారు. సంపూర్ణ సాఫల్యత రేటు మన దగ్గరే తక్కువ అనుకుంటే… చైనాలో కేవలం 1.28 కావడం గమనార్హం. 1950 నాటికి చైనాలో ఈ రేటు భారతదేశంలో 5.7 గా ఉండేది.