https://oktelugu.com/

BJP: దేశంలో పుంజుకున్న బీజేపీ.. మధ్యప్రదేశ్‌ను నిలబెట్టుకుని, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో పాగా..

రాష్ట్రంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యక్షపదేశ్‌లోనే అత్యధిక నియోజకవర్గాలు (219) ఉన్నాయి. తర్వాత స్థానంలో రాజస్థాన్‌(199), తెలంగాణ(119), ఛత్తీస్‌గఢ్‌(90), మిజోరాం(40)లో ఉన్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 3, 2023 / 03:14 PM IST

    BJP

    Follow us on

    BJP: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిల్లో బీజేపీ బలం మళ్లీ పుంజుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ బలం తగ్గింది అన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. కానీ, లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం బాగా పెరిగింది. కొత్తగా రెండు రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు కొత్తగా ఒక రాష్ట్రంలో గెలిస్తే సిట్టింగ్‌గా ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఓటమిపాలైంది.

    మధ్యప్రదేశ్‌ను నిలబెట్టుకుని..
    రాష్ట్రంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యక్షపదేశ్‌లోనే అత్యధిక నియోజకవర్గాలు (219) ఉన్నాయి. తర్వాత స్థానంలో రాజస్థాన్‌(199), తెలంగాణ(119), ఛత్తీస్‌గఢ్‌(90), మిజోరాం(40)లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి. రాజస్థాన్‌లో నెక్‌టునెక్‌ పోటీ ఉంటుందని వెల్లడించాయి. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నిలపుకుంటుందని పేర్కొన్నారు. కానీ, అనూహ్యంగా బీజేపీ మధ్యప్రదేశ్‌ను నిలుపుకోవడమే కాకుండా, కొత్తగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీ తన ఖతాలో వేసుకుంది. ఇక తెలంగాణలోనూ అనూహ్యంగా ఓటు బ్యాంకు పెంచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కేవలం 6 శాతమే ఉండగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 16 శాతానికి పెరిగింది. దీంతో బీజేపీ బలం ఖచ్చితంగా పెరిగిందని అంటున్నారు.

    రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ను కోల్పోయిన కాంగ్రెస్‌..
    తెలంగాణలో అధికారంలోకి రాబోతున్న కాగ్రెస్‌ పార్టీ ఉత్తర భారత దేశంలోని రెండ రాష్ట్రాలను కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ చాలా వెనుకబడింది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఇక్కడ నిజం కాలేదని తెలుస్తోంది.