https://oktelugu.com/

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

బిగ్‌బాస్‌ 4 సీజన్‌ ప్రారంభమై మూడు వారాలు గడుస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవ్వగా.. ఈ రోజు మరొకరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు. ఈ వారం ఎవ్వరు హౌస్‌ నుంచి వెళ్లిపోతారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో నుంచి మెహబూబా బయటకు వస్తారని గాసిప్స్‌ వచ్చాయి. కానీ.. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీ9 రిపోర్టర్‌‌ దేవీ నాగవల్లి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. Also Read: బిగ్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 / 10:34 AM IST

    bigboss 4 participants

    Follow us on


    బిగ్‌బాస్‌ 4 సీజన్‌ ప్రారంభమై మూడు వారాలు గడుస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవ్వగా.. ఈ రోజు మరొకరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు. ఈ వారం ఎవ్వరు హౌస్‌ నుంచి వెళ్లిపోతారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో నుంచి మెహబూబా బయటకు వస్తారని గాసిప్స్‌ వచ్చాయి. కానీ.. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీ9 రిపోర్టర్‌‌ దేవీ నాగవల్లి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి అనుష్క..?

    ఫస్ట్‌ వీక్‌ నుంచే దేవీ బిగ్‌బాస్‌ షోలో ఇమడలేకపోతున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లోని మిగితా లేడీ కంటెస్టెంట్లు కూడా ఆమెను పక్కన పెడుతూ వచ్చారు. వయసు తేడా.. ప్రొఫెషన్‌ కూడా తేడా కావడంతో ఆమెను అలా దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓ జర్నలిస్ట్ అయి బిగ్‌బాస్ షోలో చెవులు కొరుక్కోవడం.. కబుర్లు చెప్పడం అలవాటు పడడం దేవికి కష్టమైనట్లు కనిపిస్తోంది.

    మరోవైపు దేవి హౌస్‌లో ఉండేందుకు బయట ప్రమోషన్‌ వ్యూహం నడిచినట్లు సమాచారం. తొలిసారిగా ఆమె దర్శకుడు దాసరి చుట్టం అనే విషయాన్ని వ్యూహాత్మకంగా ఓ ప్రమోషన్‌ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తెచ్చారు. దేవీది కూడా పాలకొల్లు అని.. దాసరి చుట్టం అని చెప్పించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవచ్చని అనుకున్నారు.

    Also Read: తమిళుల ప్రేమ.. బాలు గారికి దక్కిన గౌరవం !

    కానీ.. ప్రమోషన్‌ కార్యక్రమం అంతగా ఫలితాలు ఇచ్చినట్లు కనిపించడం లేదు. అందుకే దేవీ బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటలు గడిస్తే గానీ అసలు విషయం తేలేలా లేదు. దేవీ బయటికి వస్తుందా..? మెహబూబ్‌ హౌస్‌ను విడిచిపెడతాడా..? అని.