మందుబాబులు బేజారు…అక్రమార్కులు హుషారు..!

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశిన మద్యం విధానంతో మందు బాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆకాశాన్ని అంటే అంటే ధరలతో పాటు, కేవలం పరిమిత సమయంలో మాత్రమే మద్యం లభ్యత ఉండడం వారిని ఉక్కిరి బిక్కరి చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తుంది. దుకాణాలలో కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగులను నియమించడం జరిగింది. మరి తెల్లారే సరికి చుక్కపడితే కానీ బండి నడవని ప్రాణాలు రాష్ట్రంలో చాలానే ఉంటాయి. అలాంటిది ఖచ్చితంగా […]

Written By: Neelambaram, Updated On : July 18, 2020 10:07 am
Follow us on


ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశిన మద్యం విధానంతో మందు బాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆకాశాన్ని అంటే అంటే ధరలతో పాటు, కేవలం పరిమిత సమయంలో మాత్రమే మద్యం లభ్యత ఉండడం వారిని ఉక్కిరి బిక్కరి చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తుంది. దుకాణాలలో కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగులను నియమించడం జరిగింది. మరి తెల్లారే సరికి చుక్కపడితే కానీ బండి నడవని ప్రాణాలు రాష్ట్రంలో చాలానే ఉంటాయి. అలాంటిది ఖచ్చితంగా ఉదయం 11:00 గంటల తరువాత మాత్రమే మద్యం అమ్మకాలు మొదలవుతున్నాయి. ఇక సాయంత్రం 7:00 గంటలకు గంట కొట్టినట్లుగా మూసేస్తున్నారు. మద్యం ప్రియులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. 24 గంటలు ఏ సమయంలో మందు షాపు డోరుకొట్టినా… పదో పరకో ఎక్కువ తీసుకొని మద్యం అమ్మే రోజులు పోయి..రాత్రి ఏడు గంటకే మద్యం దొరకని రోజులు వచ్చాయి.

చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?

సరే ముందుగా మేల్కొని సాయంత్రానికి కొని అట్టిపెట్టుకుందామా అంటే..రెగ్యులర్ బ్రాండ్ లు ఉండవు, ఒక్కోసారి అసలు స్టాక్ ఉండదు. మరో షాప్ కి వెళదామా అంటే అది ఎక్కడో మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నచ్చిన బ్రాండ్ కోసం అంత దూరం వెళ్లినా, ఆ బ్రాండ్ ఉంటుందనే నమ్మకం ఉండదు. లెక్కకు మించిన బ్రాండ్స్ తో కళకళలాడే మద్యం దుకాణాలు…రెండు మూడు బ్రాండ్స్ తో అది కూడా ఎప్పుడూ ఎరుగని పేర్లతో దర్శనం ఇస్తూ.. ఉసూరుమనిపిస్తున్నాయి. ఈ పరిణామం మందు బాబులకు జగన్ పై కోసం నషాళాన్ని తీసుకువెళుతుంది.

కాగా ఈ పరిస్థితి మద్యం అక్రమ రవాణాకు దారి తీస్తుంది. పక్క రాష్ట్రాలలో తక్కువ ధరలకు మద్యం విచ్చల విడిగా దొరుకుతుండటంతో కొందరు దళారులు అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. మన పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అధిక మొత్తంలో రాష్ట్రంలోకి చేరుతుంది. మద్యం షాప్ మూసివేసిన వెంటనే, అక్రమార్కులు దుకాణాలు తెరుస్తున్నారు. వారికి నచ్చిన బ్రాండ్స్ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటూ రోజుకు వేలల్లో ఆర్జిస్తునారు. దీని వలన ప్రభుత్వానికి మద్యం ద్వారా వస్తున్న అరా కోరా ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాగా ఒక్క కృష్ణా జిల్లా పరిధిలో పోలీసుల దాడుల్లో వివిధ వ్యక్తుల నుండి పట్టుబడిన 3200 లీటర్ల మద్యం సీసాలను రోడ్డు రోలర్ సాయంతో ధ్వంసం చేశారు. దీని ధర దాదాపు రూ. 72 లక్షలు అని తెలుస్తుంది. ఒక కృష్ణా జిల్లా పరిధిలోనే ఈ స్థాయిలో మద్యం అక్రమ రవాణా జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయవచ్చు.