రాష్ట్ర మాజీ ఎన్నిక కమిషనర్ నిమ్మగడ్డ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ దగ్గరికి చేరింది. రాష్ట్ర హై కోర్ట్ నిమ్మగడ్డను గవర్నర్ ని కలవాల్సిందిగా సూచించింది. దీనితో నిన్న 11:00 గంటలకు గవర్నర్ నిమ్మగడ్డకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం మరియు నిమ్మగడ్డ మధ్య నడుస్తున్న వివాదం గవర్నర్ వద్దకు వెళ్లగా..ఈ రోజు ఆయన ఈ విషయంపై ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్-టీడీపీ తెరచాటు బంధానికి ఇదే నిదర్శనం..!
స్థానిక సంస్థల ఎన్నికల రద్దు విషయంలో నిమ్మగడ్డ కావాలనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యాంగ బద్ద పదవిలో ఉండడం అంత మంచిది కాదని వైసీపీ ప్రభుత్వం భావించింది. అందుకే ఓ ప్రత్యేక జి ఓ ద్వారా నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా తొలగించడం జరిగింది. తనను కమీషనర్ గా తొలగించడం చట్ట వ్యతిరేకం అని ఆరోపించిన నిమ్మగడ్డ, హై కోర్ట్ లో ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు . నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగ విరుద్ధం అని, ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని హై కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హై కోర్ట్ తీర్పుపై స్టే కొరకు ప్రభుత్వం సుప్రీం ని ఆశ్రయించగా, హై కోర్ట్ తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదు అని ఉన్నత న్యాయస్థానము చెప్పడం జరిగింది.
జగన్ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడట..!
ఉన్నత న్యాయస్థానం హై కోర్ట్ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది కావున నిమ్మగడ్డను ఎలక్షన్ కమీషనర్ గా నియమించాలని హై కోర్ట్ మరోమారు ప్రభుత్వానికి సూచించింది. అలాగే గవర్నర్ ని కలవాల్సిందిగా నిమ్మగడ్డను ఆదేశించారు. మరి రేపు నిమ్మగడ్డ వ్యవహారంలో గవర్నర్ ఏవిధంగా స్పందిస్తాడో అని సర్వత్రా ఆసక్తినెలకొని ఉంది.