సూపర్ స్టార్ మహేష్ చాలా మృదు స్వభావి. ఆయనకంటే ఎక్కువగా ఆయన సినిమాలే మాట్లాడతాయి. వేదికలకు హాజరుకావడం, ఊక దంపుడు ఉపన్యస్యాలు ఇవ్వడం మహేష్ కి నచ్చదు. సోషల్ మీడియా విప్లవం వచ్చినప్పటి నుండి కొంచెం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్న మహేష్, ఒకప్పుడు తన సినిమా విడుదల సమయంలో తప్పితే మరలా కనిపించేవారు కాదు. ఆయన స్వభావం లాగే ఆయన సహాయం కూడా ఉంటుంది. మహేష్ ఎప్పటి నుండో తన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతున్నాడు. ఎప్పటి నుండో మహేష్ గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలైన తల్లిదండ్రుల పిల్లలకు సర్జరీలు చేయిస్తున్నాడు.
ప్రభాస్ ఒక్కడే దిక్కు.. మరి ఒప్పిస్తాడా?
ఈ విషయం చాలా కాలం తరువాత బయటపడింది. ఈ విషయాన్ని మహేష్ కానీ, ఆయన సన్నిహితులు కానీ బయటపెట్టలేదు. కాగా తాజాగా మహేష్ చిన్నపిల్లలకు చేయించిన గుండె ఆపరేషన్స్ సంఖ్య 1010 కి చేరిందట. మహేష్ ఆ విధంగా వేల పసి హృదయాలకు ఊపిరి పోశారు. కాగా మహేష్ శ్రీమంతుడు సినిమాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. ఆ మంచి పనిని రియల్ గా చేసి చూపించాడు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో రెండు గ్రామాలను మహేష్ దత్తత తీసుకొని, విద్య, వైద్యం మరియు మౌలిక వసతులు సమకూర్చారు. ఆ విధంగా మౌనంగా ఉండే మహేష్ లో ఓ పెద్ద మానవతావాది దాగున్నారు.